Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Money for the education of children of auto drivers .. PIAGGIO Scholarship

ఆటో డ్రైవర్ల పిల్లల చదువు కొరకు డబ్బులు.. PIAGGIO స్కాలర్‌షిప్
Money for the education of children of auto drivers .. PIAGGIO Scholarship

ఆటో రిక్షా డ్రైవర్ల పిల్లల కోసం పియాజియో ప్రైవేట్ లిమిటెడ్ సరికొత్త స్కాలర్‌షిప్ కార్యక్రమం ప్రకటించింది. విద్యార్థులకు వారి వార్షిక కోర్సు ఫీజులో 80% ఈ కార్యక్రమం కింద అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

దేశం మహాత్మా గాంధీ 151వ జయంతి ఉత్సవాలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో పియాజియో వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కీలక కార్యక్రమాన్ని ప్రకటించింది. ‘శిక్షా సే సమృద్ధి’ పేరుతో ఉపకారవేతన కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం కింద ఆటోరిక్షా డ్రైవర్ కమ్యూనిటీకి చెందిన పిల్లలకు స్కాలర్‌షిప్ అందించనుంది. అర్హత గల పిల్లల తల్లితండ్రులు/ సంరక్షకులకు ఈ ఉపకారవేతనం కింద డబ్బులు అందించనుంది. ఈ వర్గానికి చెందిన పిల్లలు పదో తరగతి లేదా ఇంటర్ తర్వాత చదువు మధ్యలోనే ఆపేస్తున్న విషయాన్ని గుర్తించిన పియాజియో.. వారు ఉన్నత విద్య కొనసాగించేలా ఈ ఉపకారవేతనం అందించనుంది.
పాలిటెక్నిక్/ ఐటీఐ లాంటి పూర్తి కాలపు సాంకేతిక లేదా ఒకేషనల్ కోర్సులు చేయాలనుకునే వారికి ఈ కార్యక్రమం కింద పియాజియో తోడ్పడనుంది. తన సీఎస్ఆర్ కార్యక్రమం కింద ఇందుకు గాను ‘బుడ్డీ 4 స్టడీ ఇండియా ఫౌండేషన్’తో పియాజియో వెహికిల్స్ ప్రై.లి. కలిసి పని చేయనుంది. పదో తరగతి లేదా పన్నెండో తరగతి తర్వాత ఫుల్ టైమ్ టెక్నికల్ లేదా ఒకేషనల్ కోర్సులలో పేర్లు నమోదు చేయించుకున్న వారికి సంబంధించి ఎంపికైన విద్యార్థులకు వారి వార్షిక కోర్సు ఫీజులో 80% ఈ కార్యక్రమం కింద అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది.
అర్హత, దరఖాస్తు వివరాలు..

  • పదో తరగతి లేదా పన్నెండో తరగతిలో 55 శాతం, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు దీనికి అర్హులు. 
  • పాలిటెక్నిక్/ ఐటీఐ లాంటి పూర్తికాలపు సాంకేతిక లేదా ఒకేషనల్ కోర్సులలో ఎన్‌రోల్ అయి ఉండాలి.
  • విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి. 
  • విద్యార్థులు తమ కోర్సు వార్షిక ఫీజులో 80 శాతం లేదా గరిష్ఠంగా ఏటా రూ.20,000 స్కాలర్ షిప్ గా పొందగలుగుతారు.

దరఖాస్తు కోసం హెల్ప్‌లైన్ నంబర్:
ఈ ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు సంప్రదించవలసిన హెల్ప్ లైన్ నెంబర్.. 180-012-05577
కౌన్సెలింగ్ మరియు పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
www.buddy4study.com/page/piaggio-shiksha-se-samriddhi-scholarship

గమనిక: ఈ వెబ్ లింక్, హెల్ప్ లైన్ నెంబర్ రెండూ అక్టోబర్ 2 నుంచి పనిచేస్తాయి)
Piaggio కమర్షియల్ వెహికిల్ డీలర్ షిప్ వద్ద కూడా ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన వివరాలు పొందవచ్చు. పీవీపీఎల్ డీలర్‌షిప్‌ల దరఖాస్తులు (ఆఫ్‌లైన్) లభిస్తాయి. పూర్తి చేసిన దరఖాస్తులను కూడా అక్కడే స్వీకరిస్తారు.
ఎంపిక విధానం:
అర్హులైన విద్యార్థులు మాత్రమే ఎంపికయ్యేలా చూసేందుకు గాను అర్హత పొందిన విద్యార్థులందరికీ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు జరుగుతాయి. వారు అందించిన సమాచారం సరైందేనని ధ్రువీకరించుకుంటారు. విద్యార్థుల అంతిమ సెలెక్షన్ అయిన తర్వాత విడిగా ఆన్ బోర్డింగ్ యాక్టివిటీ చేపడుతారు. కొంత కాలం పాటు ఆ విద్యార్థుల పని తీరు గమనిస్తుంటారు. సమయానుగుణంగా సమీక్షిస్తుంటారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Money for the education of children of auto drivers .. PIAGGIO Scholarship"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0