Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PM KISAN SAMMAN NIDHI SCHEME

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌

PM KISAN SAMMAN NIDHI SCHEME


ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌లో చేరిన రైతులకు తీపికబురు. పీఎం కిసాన్ ఆరో  విడత డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంకగా అందిస్తున్న స్కీమ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం. రైతులకు ఆర్థిక సాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకువచ్చింది. పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగానే డబ్బులు వచ్చి చేరతాయి.

పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏడాదికి రూ.6,000 వస్తాయి. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. మూడు విడతల్లో అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది. అంటే ఒక్కో ఇన్‌స్టాల్‌మెంట్‌కు రూ.2,000 వస్తాయి. పీఎం కిసాన్ స్కీమ్ ఆరంభం నుంచి చూస్తే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రూ.12,000 జమచేసింది.

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్ స్కీమ్) ద్వారా ఒకే రోజు 8.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.17,100 కోట్లను జమ చేశారు.

పీఎం కిసాన్ పథకం కింద పేద రైదులకు ఏటా రూ.6వేల ఆర్థిక సహాయాన్ని మూడు విడతలుగా(రూ.2వేలు చొప్పున) అందజేస్తున్నది. 2018, డిసెంబర్ 1 నుంచి ఈ పథకం అమలవుతుంది. ఆదివారం నాడు ఆరో విడత నగదు బదిలీని ప్రధాని చేపట్టారు.

ఒక వేళ మీ ఖాతాలో డబ్బు జమకాకపోతే  మీ బ్యాంక్ అకౌంటెంట్ లేదా జిల్లా వ్యవసాయ అధికారిని సంప్రదించవచ్చు.

కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క హెల్ప్‌లైన్ నంబర్‌

PM-Kisan హెల్ప్‌లైన్ 155261 లేదా టోల్ ఫ్రీ 1800115526

మంత్రిత్వ శాఖ యొక్క  హెల్ప్‌లైన్ నంబర్ (011-23381092)

డబ్బులు రైతులు తమ అకౌంట్లలో జమ అయ్యాయా లేదా ఈ క్రింది లింక్ ద్యారా తెలుసుకోండి 

CLICK HERE : Beneficiary Status

ఒకవేళ ఇంకా మీరు ఈ స్కీమ్‌లో చేరకపోతే వెంటనే చేరండి. ఆన్‌లైన్‌లో పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సులభంగానే స్కీమ్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.

రిజిస్టర్ వెబ్‌సైట్ : CLICK HERE

https://pmkisan.gov.in/RegistrationForm.aspx

మీరు మొబైల్లో యాప్ ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు : 

MOBILE APP LINK CLICK HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "PM KISAN SAMMAN NIDHI SCHEME"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0