Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

RBI relaxes LTV rules to make home loans taken till March 2022 cheaper

హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త.. RBI కీలక నిర్ణయం!

RBI relaxes LTV rules to make home loans taken till March 2022 cheaper


హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఆర్‌బీఐ శుభవార్త. రిజర్వు బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు దిగివచ్చే ఛాన్స్ ఉంది. 

సొంతింటి కల సాకారం  భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. పండుగ సీజన్ నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో హోమ్ లోన్ తీసుకొని కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలని భావించే వారికి ఊరట కలుగనుంది. వడ్డీ రేట్లు దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 

రూ.30 లక్షలకు పైన హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది. రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం కారణంగా బ్యాంకులకు, ఫైనాన్స్ కంపెనీలు ఈ తరహా రుణాలపై వ్యయాలు తగ్గనున్నాయి. దీంతో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు దిగివచ్చే ఛాన్స్ ఉంది. మరీముఖ్యంగా రూ.75 లక్షలకు పైన హోమ్ లోన్ పొందే వారికే ఎక్కువ బెనిఫిట్ కలగొచ్చు.

ప్రస్తుతం హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు రుణ మొత్తంపై ఆధారపడి మారుతున్నాయి. రూ.30 లక్షల వరకు హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తక్కువగానే ఉన్నాయి. ఉదాహరణకు దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI రూ.30 లక్షల వరకు రుణాలపై 7 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది. రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల మధ్యలో హోమ్ లోన్స్‌పై 7.25 శాతం వడ్డీని తీసుకుంటోంది. 

అదే రూ.75 లక్షలకు పైన హోమ్ లోన్స్‌పై ఎస్‌బీఐ 7.35 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా వరుసగా 7.15, 7.25, 7.3-7.4 శాతం చొప్పున వడ్డీని విధిస్తోంది. ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా రూ.30 లక్షల వరకు అయితే 6.95 శాతం వడ్డీ తీసుకుంటోంది. ఆపైన రుణ మొత్తానికి 7.05 శాతం వడ్డీ తీసుకుంటోంది. ఆర్‌బీఐ శుక్రవారం నాటి పాలసీ సమీక్షలో 2022 మార్చి వరకు హోమ్ లోన్స్‌కు సంబంధించి రుణ మొత్తంతో కాకుండా ఎల్‌టీవీ ప్రాతిపదికన క్యాపిటల్ రిక్వైర్‌మెంట్ ఉంటుందని వెల్లడించిన విషయం తెలిసిందే

Current scenario, LTV ratios, risk weights and standard asset provisioning rate.




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " RBI relaxes LTV rules to make home loans taken till March 2022 cheaper"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0