Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Santhoor womens Scholarships for Government School Students 2020

SCHOLARSHIPS - అమ్మాయిలకు ₹24 వేలు స్కాలర్‌షిప్..

Santhoor womens Scholarships for Government School Students 2020


అమ్మాయిలకు ₹24 వేలు స్కాలర్‌షిప్..

ఆర్థికంగా వెనుక బడిన అమ్మాయిలను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి విప్రో సంస్థ.. సంతూర్‌ ఉపకార వేతనాలను అందిస్తోంది.

పేదరికం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులకు వెళ్లలేని అమ్మాయిలను ఆర్థికంగా ఆదుకొని.. ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి విప్రో సంస్థ.. సంతూర్‌ ఉపకారవేతనాలను అందిస్తోంది. తాజాగా ఈ స్కాలర్‌షిప్‌ ప్రకటన వెలువడింది. ఇంటర్‌ పూర్తిచేసిన అమ్మాయిలు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంతూర్‌ ఉమెన్స్‌ స్కాలర్‌షిప్ 2016-17 నుంచి:

ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం ఉన్న బాలికలను చదువులో ప్రోత్సహించడానికి విప్రో కన్సూమర్‌ కేర్, విప్రో కేర్స్‌ కలిసి 2016-2017 విద్యా సంవత్సరం నుంచి వీటిని అందిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల నుంచి ఏడాదికి 900 మందికి ఈ ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. గత నాలుగేళ్లలో 3600 మంది విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌ తోడ్పాటుతో ఉన్నత చదువులు కొనసాగిస్తున్నారు.

విప్రో స్కాలర్‌షిప్‌

ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులకు మూడేళ్లు లేదా కోర్సు పూర్తయినంత వరకు ప్రతినెలా రూ. రెండువేల చొప్పున స్కాలర్‌షిప్‌ ఇస్తారు. డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమవుతుంది. ట్యూషన్‌ ఫీజులు, పుస్తకాలు, ఇతర సదుపాయాల కోసం దీన్ని ఉపయోగించుకోవచ్చు.

Must Read: డిగ్రీ, బీటెక్, ఇతర యూజీ‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. దరఖాస్తులు ప్రారంభం..!

అర్హతలు:

  • 1) పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీల్లోనే చదివుండాలి
  • 2) ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పేద బాలికలే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.
  • 3) 2019-20 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ లేదా సమాన స్థాయి కోర్సులు పూర్తిచేసినవారై ఉండాలి.
  • 4) 2020-21లో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరి ఉండాలి.
  • 5) కనీసం మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న డిగ్రీ కోర్సుల్లో చేరినవారే ఈ స్కాలర్‌షిప్పు పొందడానికి అర్హులు.
  • 6) హ్యుమానిటీస్, లిబరల్‌ ఆర్ట్స్, సైన్స్‌ కోర్సుల్లో చేరినవారికి, వెనుకబడిన జిల్లాలకు చెందినవారికి ఎంపికలో కొంత ప్రాధాన్యం ఉంటుంది.
  • 7) అకడమిక్‌ మెరిట్‌ ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేస్తారు.

సంతూర్‌ స్కాలర్‌షిప్ ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: అప్లికేషన్‌ ఫామ్‌ను సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని, ప్రింటవుట్‌ తీసుకోవాలి. అందులో పూర్తి వివరాలను నింపి పోస్టు ద్వారా పంపాలి. దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తుకు చివరి తేది: 31.10.2020

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: విప్రో కేర్స్‌- సంతూర్‌ స్కాలర్‌షిప్, దొడ్డకన్నెల్లి, సర్జాపూర్‌ రోడ్డు, బెంగళూరు - 560035, కర్ణాటక..


DOWNLOAD APPLICATION FORM

SANTHOOR SCHOLARSHIPS APPLICATION & COMPLETE DETAILS

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Santhoor womens Scholarships for Government School Students 2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0