The bulk of the remaining seats in the policet are filled by 48 per cent in first installment counseling
పాలిసెట్‌లో భారీగా మిగిలిన సీట్లుమొదటి విడత కౌన్సెలింగ్‌లో 48 శాతమే భర్తీ.
ఏపీ పాలిసెట్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో 48.07 శాతం సీట్లే భర్తీ అయ్యాయి. కేటాయింపు వివరాలను కన్వీనర్ ఎం.ఎం.నాయక్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటులో కలిపి 72,713 సీట్లు ఉండగా 34,956 మాత్రమే నిండాయి. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, అందర్నీ ఉత్తీర్ణులు చేసినందున సీట్ల భర్తీ పెరుగుతుందని భావించగా.. ఈసారి గతేడాది కంటే సీట్ల భర్తీ తగ్గడం విశేషం. క్రీడా ధ్రువపత్రాల పరిశీలన పూర్తికానందున ఈ కోటా కింద 326 మందికి సీట్ల కేటాయింపును వాయిదా వేశారు. గతేడాది 55.37 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేటు కళాశాలల్లో ప్రతిసారీ సగమైనా నిండటం లేదు.
- పాలిసెట్‌లో అర్హత సాధించిన వారు: 60,780
- కౌన్సెలింగ్‌కు నమోదు చేసుకున్న వారు: 38,542
- ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు: 38,131
- సీట్ల కోసం ఐచ్ఛికాలు ఇచ్చినవారు: 37,466
0 Response to "The bulk of the remaining seats in the policet are filled by 48 per cent in first installment counseling"
Post a Comment