Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The good news: Corona Peak phase is gone .. Completely over in 4 months

గుడ్ న్యూస్: కరోనా పీక్ దశ వెళ్లిపోయింది.. 4 నెలల్లో పూర్తిగా అంతం

The good news: Corona Peak phase is gone .. Completely over in 4 months


కరోనా మహమ్మారితో వణికిపోతున్న ప్రజలకు శుభవార్త. దేశంలో ఫిబ్రవరి నాటికి వైరస్ పూర్తిగా అంతమవుతుందట. వైరస్ వ్యాప్తి ఇప్పటికే పీక్ దశను దాటేసిందట. దేశంలో కొవిడ్-19 వ్యాప్తి అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ వివరాలు చెప్పింది. కొత్తగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం శుభసూచకమని పేర్కొంది. ఇదే సమయంలో పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కమిటీ చెప్పిన కీలక వివరాలు:

  • దేశంలో ప్రస్తుతం నెలకు సరాసరి 26 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా కేసుల్లో క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది.
  • దేశంలో ఇప్పటివరకు కేవలం 30 శాతం మంది మాత్రమే కరోనా వైరస్‌కు రోగనిరోధక శక్తి (Immunity) కలిగి ఉన్నారు.
  • ప్రజలు కొవిడ్-19 మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిందే. నిబంధనలను కచ్చితంగా పాటిస్తే వచ్చే సంవత్సరం (2021) ప్రారంభంలో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది.
  • కరోనా అదుపులోకి వచ్చే నాటికి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య కోటి ఐదు లక్షలకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ సంఖ్య 75 లక్షలుగా ఉంది.
  • దేశంలో సెప్టెంబర్ 17 ఒక్క రోజే గరిష్టంగా 98 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇవే అత్యధిక కేసులు.
  • కరోనా మహమ్మారి బారినపడి దేశంలో ఇప్పటివరకు 1.14 లక్షల మంది మరణించారు.
  • వైరస్ అదుపులోకి వస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ఆంక్షలను తొలగించి, అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇవ్వవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The good news: Corona Peak phase is gone .. Completely over in 4 months"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0