Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The new service from phonepe is no longer available for car and bike insurance services.

 Phonepe నుండి కొత్త సర్వీసు ఇకపై కారు , బైకు ఇన్సురెన్స్ సేవలు అందుబాటు లోకి.

The new service from phonepe is no longer available for car and bike insurance services.


ఫోన్ పే సంస్థను 2016 లో ఫ్లిప్ కార్ట్ కొనుగోలు చేసింది . డిజిటల్ వాలెట్ సేవలు , యూపీఐ చెల్లింపులను అందించడంతో పాటు మ్యూచువల్ ఫండ్స్,ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్,లిక్విడ్ ఫండ్స్,ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సేవలను Phonepe అందిస్తోంది .

అన్ని విభాగాల్లోకి తమ సేవలను విస్తరించే పనిలో ఉన్న ఫోన్‌ఫే సంస్థ తాజాగా కార్లు, బైక్‌లకు ఇన్యూరెన్స్ అందిస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అందిస్తోంది. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌ సంస్థతో కలిసి ఫోన్‌పే వినియోగదారులకు ఈ సేవలు అందించనుంది. టూ వీలర్లకు ఇన్సూరెన్స్ రూ.482 నుంచి ప్రారంభమవుతుంది. కారు ఇన్సూరెన్స్ రూ.2,072 నుంచి ప్రారంభమవుతుంది. ఫోన్‌పే యాప్‌లోని ఇన్సూరెన్స్‌ విభాగంలో ఉన్న మోటార్ ఇన్సూరెన్స్ పేజీ నుంచి కారు, బైక్ ఇన్సూరెన్స్‌ పాలసీలను కొనుక్కోవచ్చు. యాప్‌లోనే డబ్బు చెల్లించి పాలసీ డాక్యుమెంట్లను యాక్సెస్ చేసుకోవచ్చు.

ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఎక్కువ మందికి చేరువ చేయడానికి థర్డ్ పార్టీ గ్యారేజీలతో క్యాష్‌లెస్‌ రిపేరింగ్ సర్వీస్ను అందిస్తామని ఫోన్‌పే ప్రకటించింది. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌ సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్న గ్యారేజీల నెట్‌వర్క్‌ ద్వారా ఈ సేవలు అందించనున్నారు. వినియోగదారులు 20 నిమిషాల్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. జీరో డిప్రిసియేషన్‌, 24X7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఇంజిన్ ప్రొటెక్షన్‌ వంటి వ్యాల్యూ యాడెడ్ సేవలను కూడా కస్టమర్లు ఎంచుకోవచ్చు. వినియోగదారులు కేవలం రెండు నిమిషాల్లోనే ఈ పాలసీలను కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

మోటారు ఇన్సూరెన్స్ తో రక్షణ

వాహనాలకు మోటారు ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఐటి, వెబ్ సేల్స్ అండ్ ట్రావెల్ విభాగానికి ప్రెసిడెంట్, హెడ్ సౌరభ్ ఛటర్జీ చెబుతున్నారు. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ఇన్సూరెన్స్ రక్షణ కల్పిస్తుందన్నారు. ఇప్పటికీ భారత్‌లో ఇన్సూరెన్స్ తీసుకోని టూ వీలర్లు, కార్లు ఎన్నో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

వాహనాల అమ్మకాలు పెరిగాయి

ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ కార్ల అమ్మకాలు కరోనాకు ముందు ఉన్న స్థాయికి చేరుకున్నాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ నివేదిక చెబుతోంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే మోటారు ఇన్సూరెన్స్ విభాగం వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫోన్‌పే వైస్ ప్రెసిడెంట్, ఇన్సూరెన్స్ హెడ్ గుంజన్ ఘాయ్ చెబుతున్నారు. దేశంలో ఉన్న మొత్తం వాహనాల్లో 70 శాతం టూ వీలర్లే ఉన్నాయని ఆయన చెప్పారు. "మా కస్టమర్లకు అన్ని రకాల ఇన్సూరెన్స్‌ సేవలకు గమ్యస్థానంగా ఉండాలనే లక్ష్యంతో కొత్త సేవలను ప్రవేశపెట్టాం. మోటారు ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలనుకునేవారికి మా సంస్థ సులభమైన, సౌకర్యవంతమైన మార్గాలను అందిస్తుంది. వినియోగదారులు సులభంగా యాప్‌లోనే ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకునే అవకాశాలు కల్పించాం" అని ఘాయ్ వివరించారు.

ఇతర సేవలున్నాయి

ఫోన్‌ పే సంస్థను 2016లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. డిజిటల్ వాలెట్ సేవలు, యూపీఐ చెల్లింపులను అందించడంతో పాటు మ్యూచువల్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి సేవలను ఫోన్‌పే అందిస్తోంది. కోవిడ్-19 నేపథ్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లను కూడా ఆ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సుమారు ఐదు లక్షల ఇన్సూరెన్స్ పాలసీలను అమ్మినట్లు ఫోన్‌పే ఇటీవల ప్రకటించింది. కొనుగోలుదారులలో చాలామంది టైర్ 2,3 నగరాలకు చెందినవారే ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మొదటిసారి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నవారే కావడం విశేషం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The new service from phonepe is no longer available for car and bike insurance services."

Post a comment