Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Another 5 Revenue Divisions!

మరో 5 రెవెన్యూ డివిజన్లు!

Another 5 Revenue Divisions!


  • కొత్త జిల్లాల ఏర్పాటు కోసమే..
  • మండలాలు, గ్రామాల సర్దుబాటు
  • వారంలో సీఎం సమీక్ష


రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం అదనంగా మరో 5 రెవెన్యూ డివిజన్లు అవసరమని భావిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటించేందుకు వీలుగా ఏర్పడిన కమిటీలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్ల పునర్విభజనపై రెవెన్యూశాఖ అధ్యయనం చేస్తోంది.

 రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు, 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇందులో 23 రెవెన్యూ డివిజన్లు ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోనే ఉన్నాయి. మిగిలిన 28 డివిజన్లు రెండు కొత్త జిల్లాల పరిధిలోకి వస్తున్నాయి. అనంతపురం రెవెన్యూ డివిజన్‌ పరిధి హిందూపురం వరకు ఉంది. ప్రస్తుత లోక్‌సభ స్థానాన్నే జిల్లాగా ప్రకటించాలంటే.. విజయనగరం రెవెన్యూ డివిజన్‌ అరకు, విజయనగరం, విశాఖ జిల్లాల పరిధిలోకి వెళ్తుంది. ఇలాంటి వాటిని సర్దుబాటు చేయాలంటే అదనంగా 5 డివిజన్లను ఏర్పాటు చేయాల్సి వస్తుంది.

దీనికి ముందు పోలీసుశాఖలో ఉన్న 81 సబ్‌డివిజన్ల హద్దులనూ పరిశీలించారు.

మండలాల సర్దుబాటు

ప్రస్తుతం ఒకే మండలంలోని కొన్ని గ్రామాలు రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నాయి. పలుచోట్ల రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోనూ ఉన్నాయి. ముందుగా వీటిని సర్దుబాటు చేస్తారు. అరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా ప్రకటిస్తారు

1979లో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో విజయనగరం ఏర్పడింది.

వారంలో సీఎం సమీక్ష

ముఖ్యమంత్రి జగన్‌ వారంలోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో కొత్త జిల్లాల ఏర్పాటు పురోగతిపై సమీక్షించనున్నారు.

అప్పుడు వెలువడే ఆదేశాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు నెలరోజుల గడువు ఇస్తారు. ఒకటి రెండు నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Another 5 Revenue Divisions!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0