AP Ration Rules:
AP Ration Rules: ఏపీలో కొత్త రూల్స్, 2021 నుంచి రేషన్ తీసుకోవాలంటే క్రింది రూల్స్ పాటించాలి.
ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరింత పారదర్శకంగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి గ్రామ, వార్డు వాలంటీర్లు వాళ్లే నేరుగా వాహనాల ద్వారా సరుకులను ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. 5, 10, 15 కేజీల చొప్పున బియ్యం ప్యాకింగ్ చేసి, కార్డు ఉన్నవారి అర్హతను బట్టి పంపిణీ చేస్తారు. ఎంఎల్ఎస్పీ పాయింట్ నుంచి నేరుగా సరుకులు రేషణ్ దుకాణాలకు వస్తాయి. అక్కడి నుంచి సరుకులు తీసుకుని తమ పరిధిలోని ఇళ్లకు వాలంటీర్లు అందజేస్తారు. 2021 జనవరి 1 నుంచి రేషన్ తీసుకోవాలంటే.. ప్రతి ఇంటికి మొబైల్ ఫోన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. సరుకులు అందజేసిన తర్వాత ఆ మొబైల్ ఫోన్కు ఓటీపీ వస్తుంది.
ఆ ఓటీపీని వాలంటీర్లు తమ సర్వర్లో నమోదు చేస్తేనే సంబంధిత కుటుంబానికి సరుకులు చేరినట్లు లెక్క.
దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు మరోవైపు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఇకపైదేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చు. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమల్లోకి వచ్చిందని కేంద్రఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. సెప్టెంబరు 1 నుంచి 68.8 కోట్ల మందిని నేషనల్ పోర్లబిలిటీ కిందకు తీసుకొచ్చామని వెల్లడించారు. వీరిందరికి ఎంతో లబ్ధి చేకూరుతోందని ఆమె అన్నారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ద్వారా నెలకు 1.5 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు.
వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమల్లోకి వచ్చిన రాష్ట్రాలు
ఆంధ్రప్రదేశ్, హర్యానా, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, సిక్కిమ్, మిజోరాం, తెలంగాణ, కేరళ, పంజాబ్, త్రిపుర, గోవా, హిమాచల్ ప్రదేశ్, దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్
0 Response to "AP Ration Rules: "
Post a Comment