Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Conducting classes for 8th grade students from the 23rd of this month

 ఈ నెల 23వ తేదీ నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహణ

Conducting classes for 8th grade students from the 23rd of this month

క్రమేణా ఉన్నత పాఠశాలల్లో అన్ని  తరగతులు నిర్వహణకు ఏర్పాట్లు. 

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడి. 

సచివాలయం : ఈనెల 23 సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటికే ఈనెల 2 నుంచి 9, 10 తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న సంగతి విదితమే. విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు సుముఖంగా ఉండటం తో పాటు హాజరు శాతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 8వ తరగతి విద్యార్థులకు కూడా పాఠశాలల్లో తరగతులు నిర్వహించాలని నిర్ణయించటం జరిగింది. 8, 9 తరగతుల విద్యార్థులు రోజుమార్చి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉండగా 10 వ తరగతి విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ మూడు తరగతుల విద్యార్థులకు బోధన జరుపుతూ డిసెంబర్ 14 నుంచి  6, 7 తరగతి విద్యార్థులకు కూడా తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. 14వ తేదీ తరువాత అప్పటి పరిస్థితి సమీక్షించుకుని 1-5 తరగతులపై నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది. 

1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవుల తర్వాత నిర్వహించాలనుకుంటున్నట్లు ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 వరకు జరుగుతున్న పాఠశాలలు చలికాలం కారణంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వటం జరిగిందని మంత్రి సురేష్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పునఁప్రారంభం షెడ్యూల్ లో మార్పులు.

  • పెరుగుతున్న చలి తీవ్రత దృష్ట్యా పాఠశాలల వేళల్లో మార్పు.
  • 1-5 తరగతులకు సంక్రాంతి సెలవుల తర్వాత.
  • 6,7 తరగతులు డిసెంబరు 14 నుండి..
  • 8 వ తరగతి ఈ నెల 23 నుండి.
  • 8,9 తరగతులు రోజు మార్చి రోజు 9:30-1:30
  • 10 వ తరగతికి ప్రతిరోజు క్లాసులు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Conducting classes for 8th grade students from the 23rd of this month"

Post a comment