Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Education Department proposal .. The decision will be released today

 సరి–బేసిలో స్కూల్స్‌


విద్యా శాఖ ప్రతిపాదన.. నేడు వెలువడనున్న నిర్ణయం

 సరి–బేసి విధానంలో సోమవారం నుంచి ఆరు, ఏడు, ఎనిమిది తరగతులకు స్కూల్స్‌ నిర్వహించాలని విద్యా శాఖ చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వస్తోంది. 

ఈ నెల 2వ తేదీ నుంచి 9, 10 తరగతులను ప్రారంభించగా విద్యార్థుల హాజరు క్రమేణా పెరుగుతోంది. పాఠశాలల వారీగా తరగతి గదులు, విద్యార్థుల సంఖ్య, తదితర వివరాలతోపాటు సరి–బేసిపైనా హెచ్‌ఎంల నుంచి సూచనలు స్వీకరించినట్లు సమాచారం. 

పాఠశాలలు, తరగతి గదులు, విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని స్థానిక పరిస్థితులను బట్టి ఇకపై రెండు పూటలా తరగతులు నిర్వహించనున్నారు. 

విద్యార్థులు ఎక్కువ సంఖ్యలోవున్న పాఠశాలల్లో కొన్ని తరగతులను రోజు విడిచి రోజు (సరి–బేసి విధానం) నిర్వహించే వెసులుబాటును హెచ్‌ఎంలకే అప్పగించనున్నారు. 

తరగతి గదికి 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలన్న ప్రాథమిక నియమం విధించనున్నారు. విద్యా శాఖ నుంచి అధికారికంగా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. 

 సరి – బేసి విధానం ప్రకారం తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ అధికారికంగా నిర్ణయం తీసుకుంటే ఈ నెల 23న 6, 8, 10 తరగతులు, 24న 7, 9 తరగతులు ప్రారంభిస్తారు. ఆ తదుపరి ఇదే క్రమంలో తరగతులు ఉంటాయి. 

ఉదాహరణకు 6, 8, 10 తరగతుల విద్యార్థులు మొత్తం 400 మంది ఉంటే తరగతికి 16 మంది చొప్పున పాఠశాలలో మొత్తం 25 తరగతి గదులు ఉంటే అనుమతిస్తారు. 

తరగతికి 16 మంది విద్యార్థుల చొప్పున లెక్కించి నిర్వహించదలచిన తరగతులకు సరిపడినన్ని గదులు లేని సందర్భంలో అలా మిగిలిన విద్యార్థులకు మూడో రోజున తరగతులు ఉంటాయి. 

7, 9 తరగతులకు సంబంధించి మొత్తం విద్యార్థులను రెండు భాగాలుగా విభజించి ఒక్కో తరగతికి సగం మంది విద్యార్థులకు ఉదయం, మిగతా సగం మందికి మధ్యాహ్నం పూట తరగతులు నిర్వహిస్తారు. 

ఉదయం విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలు పెట్టి ఇళ్ళకు పంపిస్తారు. మధ్యాహ్నం పూట తరగతులకు వచ్చే విద్యార్థులకు స్కూలులో మధ్యాహ్న భోజనం పెట్టిన తరువాత తరగతులు నిర్వహిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Education Department proposal .. The decision will be released today"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0