Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Explaining on the announcement that charges will be levied on digital payments, Google Pay

 డిజిటల్ పేమెంట్ లపై ఛార్జీలు వసూలు చేస్తామని ప్రకటనపై వివరణ ఇచ్చిన GOOGLE పే

Explaining on the announcement that charges will be levied on digital payments, Google Pay

GOOGLE పే తమ కస్టమర్లకు షాకివ్వనుందని, 2021 జనవరి నుండి GOOGLE పే వెబ్ యాప్స్ సేవలు నిలిపివేస్తుందని, అలాగే GOOGLE పే నుండి తక్షణ నగదు బదలీ కోసం గాను ఛార్జీలు వసూలు చేయనుందని వార్తలు వచ్చాయి. GOOGLE పే వినియోగదారులు డబ్బులు పంపించేందుకు గూగుల్ పే యాప్ లేదా GOOGLE పే వెబ్‌ను ఉపయోగిస్తున్నారు.

2021 నుండి డబ్బు పంపించేందుకు, స్వీకరించేందుకు పే డాట్ GOOGLE డాట్ కాంను ఉపయోగించలేరని, ఇఖ నుండి GOOGLE పే యాప్‌ను ఉపయోగించాలని కంపెనీ అమెరికాలో తెలిపింది. భారత్‌లోను వర్తిస్తుందని భావిస్తూ వార్తలు వచ్చాయి. దీనిపై GOOGLE పే స్పందించింది.

భారత్‌లో కాదు..అమెరికా యూజర్లకు మాత్రమే

GOOGLE పే ప్లాట్‌ఫాం నుండి మనీ ట్రాన్సుఫర్‌కు అదనపు రుసుం చెల్లింపులపై వస్తోన్న వార్తల మీద ఆ సంస్థ స్పష్టతనిస్తూ.. ఇది కేవలం అమెరికన్ యూజర్లకు మాత్రమేనని, భారత్‌లో కస్టమర్లకు ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని తేల్చి చెప్పింది. సరికొత్త ఫీచర్లతో GOOGLE పే యాప్‌ను విడుదల చేస్తున్నట్లు GOOGLE ఇటీవల తెలిపింది. ప్రస్తుతం దీనిని అమెరికాలో ప్రయోగాత్మకంగా అందుబాటులోక తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో GOOGLE పే యాప్ నుండి చేసే మనీ ట్రాన్సుఫర్‌కు అదనపు రుసుము చెల్లించవలసి ఉంటుంది.

అమెరికాలో వెబ్ GOOGLE పే ఉండదు

భారత్‌లోని GOOGLE పే, గూగుల్ పే బిజినెస్ కస్టమర్లు ఈ ఛార్జీ చెల్లించవలసిన అవసరం లేదని GOOGLE పే తెలిపింది. కేవలం అమెరికాలో ఛార్జీ ఉంటుందని పేర్కొంది. కొత్త ఏఢాది నుండి అమెరికాలో వెబ్ ఆధారిత GOOGLE పే ఉండదని, కేవలం యాప్‌లో మాత్రమే చెల్లింపులు చేయాలని తెలిపింది. కొత్త ఫీచర్లతో కలిగిన GOOGLE యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో అందుబాటులో ఉంటుంది. వెబ్ బ్రౌజర్ అమెరికాలో మాత్రమే వినియోగించలేరు.

వివిధ రకాల చెల్లింపుల సౌలభ్యం

GOOGLE పే బిజినెస్ యాప్‌ను భారత్‌లో 30 లక్షల మంది వ్యాపారులు వినియోగిస్తున్నారని జూన్ నెలలో ప్రకటించింది. వీటి ద్వారా కేవలం యూపీఐ ఆధారిత చెల్లింపులే కాకుండా డెబిట్, క్రెడిట్ కార్డుల నుండి కూడా చెల్లింపులు చేసుకునే సౌలభ్యం ఉంటుంది. GOOGLE పేకు భారత్‌లో 6.7 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. రూ.110 బిలియన్ డాలర్ల చెల్లింపులు ఈ సాధనం ద్వారా జరుగుతుంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Explaining on the announcement that charges will be levied on digital payments, Google Pay"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0