Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Government gives green signal for transfer of teaching staff working in Kasturbagandhi Girls' Schools (KGBV)

కేజీబీవీల్లో బదిలీల హడావుడి..

Government gives green signal for transfer of teaching staff working in Kasturbagandhi Girls' Schools (KGBV)

బోధన సిబ్బందికే పరిమితం

అభ్యర్థన మేరకే స్థానచలనం

ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న బోఽధన సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది నవంబరు 1 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తయిన వారు బదిలీ దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. బోధన సిబ్బంది స్టేషన్‌ సీనియారిటీ, ఆ కేడర్‌లో ఉన్న సర్వీసు సీనియారిటీకి పాయింట్లు కేటాయిస్తారు. క్రమశిక్షణ చర్యల కింద పరిపాలన సౌలభ్యం కోసం బదిలీ చేసిన  సిబ్బంది ప్రస్తుతం దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. అనఽధికారికంగా విధులకు గైర్హాజరవుతుంటే వాటిని కూడా ఖాళీలుగా ప్రకటిస్తారు.

బదిలీల షెడ్యూల్‌ ఇదీ.

  • ఈనెల 26 నుంచి 30 వరకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవాలి. 
  • డిసెంబరు 2న అంతర్‌జిల్లా బదిలీ కోసం వచ్చిన దరఖాస్తులను రాష్ట్రస్థాయిలో సమగ్రశిక్ష రాష్ట్ర కార్యాలయంలో పరిశీలిస్తారు. 
  • డిసెంబరు 4వతేదీ నాటికి బోధన సిబ్బంది అంతర్‌జిల్లా బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తారు. 
  • డిసెంబర్‌ 1 నుంచి 6వ తేదీ వరకు జిల్లాస్థాయిలో బదిలీ కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో పరిశీలిస్తారు. 
  • డిసెంబరు 8న దరఖాస్తు చేసుకున్న వారికి లభించిన పాయింట్ల ఆధారంగా వారి ప్రాథమిక సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు. అదేరోజు ఖాళీల వివరాలు కూడా ప్రకటిస్తారు. 
  • డిసెంబరు 10న అభ్యంతరాలను స్వీకరిస్తారు. 
  • డిసెంబరు 12న బదిలీల తుది సీనియారిటీ, ఖాళీల తుదిజాబితాను ప్రకటిస్తారు. 
  • డిసెంబరు 14 నుంచి 17 వరకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న సిబ్బందికి కౌన్సెలింగ్‌ నిర్వహించి బదిలీ ఉత్తర్వులు జారీచేస్తారు. 
  • 19న బదిలీ అయిన సిబ్బంది అందరూ కొత్తస్థానాల్లో బాధ్యతలు స్వీకరిస్తారు. 
  • అంతర్‌ జిల్లా బదిలీ కోరుకునే వారు ఏపీసీ ద్వారా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌కు బదిలీ దరఖాస్తు సమర్పించాలి. జిల్లాలో బదిలీ కోరుకునే వారు సమగ్రశిక్ష ఏపీసీకి దరఖాస్తులు సమర్పిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Government gives green signal for transfer of teaching staff working in Kasturbagandhi Girls' Schools (KGBV)"

  1. आपके द्वारा दी गई जानकारी बहुत ही महत्वपूर्ण है। जानकारी साझा करने की लिए आपका बहुत बहुत धन्यवाद । परिवहन सेवा की सभी जानकारी यहां देखें

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0