Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to close a bank account?

బ్యాంకు ఖాతాను మూసివేయ‌డం ఎలా?

How to close a bank account?

ఖాతా క్లోజ‌ర్ ఫార‌మ్ బ్యాంకు వ‌ద్ద ల‌భిస్తుంది. ఖాతా మూసివేయ‌డానికి గ‌ల కారాణాన్ని ఇందులో వివ‌రించాలి.

బ్యాంకు నిబంధ‌న‌ల‌కు త‌గిన‌ట్లుగా నెల‌వ‌రీ స‌గ‌టు బ్యాలెన్స్‌ను నిర్వ‌హించ‌డం ద్వారా బ్యాంకు ఖాతాను నిర్వ‌హించ‌వ‌చ్చు.ఏదైనా ఖాతా వాడ‌కుండా నిరుప‌యోగంగా ఉంచితే దాన్ని తిరిగి మ‌నుగ‌డ‌లోకి తెచ్చుకోండి లేదా మూసివేయండి. వీలైనంత వ‌ర‌కు ఒక‌టి లేదా రెండు బ్యాంకుల్లో ఖాతాల‌ను ఉంచుకుంటే స‌రిపోతుంది. మిగ‌తా వాటిని ర‌ద్దు చేసుకోవ‌డ‌మో , మూసివేయ‌డ‌మో మంచిది. ఇది మ‌న ఆర్థిక ఆరోగ్యానికి మంచిది. భ‌విష్య‌త్తులో క్రెడిట్ స్కోరు, రుణాల మంజూరులోనూ సానుకూలంగా ఉంటుంది.

ఖాతాను డీ-లింక్ చేయ‌డం:

ఖాతాను మూసివేసేందుకు ముందు, ఏవైనా పెట్టుబడులు, రుణాలు, ట్రేడింగ్, క్రెడిట్ కార్డు చెల్లింపులు, డిపాజిట్లు, ఎన్ఏసీహెచ్ నిబంధ‌న‌లు లేదా స్టాండింగ్ సూచనలు వంటి వాటిని ఈ ఖాతా నెంబ‌రుతో రిజిస్ట‌ర్ చేసివుంటే వాటిని ఈ ఖాతాతో డీ లింక్ చేసి, ప్ర‌స్తుతం ఉప‌యోగిస్తున్న ఖాతాను అనుసంధానించాలి. మూసివేయు స‌మ‌యంలో డీ-లింకింగ్ ఖాతా ఫార‌మ్‌ను పూర్తి చేయాలి.

క్లోజ‌ర్‌ ఫారం:

ఖాతా క్లోజ‌ర్ ఫార‌మ్ బ్యాంకు వ‌ద్ద ల‌భిస్తుంది. ఖాతాదారుడు ఫార‌మ్‌ను పూర్తి చేసి సంత‌కం పెట్టి బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. ఖాతాలో ఉన్న నిధుల‌ను బ‌దిలీ చేసేందుకు ప్ర‌స్తుతం మ‌నుగ‌డ‌లో ఉన్న‌ ఖాతా వివ‌రాల‌తో మ‌రొక ఫార‌మ్‌ను ఇవ్వాలి. ఖాతాను మూసివేసేందుకు ఖాతాదారుడు బ్యాంకును స్వ‌యంగా సంద‌ర్శించాలి.

ప‌త్రాలు:

మీరు మూసివేయాలి అనుకుంటున్న ఖాతాకు సంబంధించి, ఉప‌యోగించ‌ని చెక్కు బుక్కులు, కార్డుల‌ను ఫార‌మ్‌తో పాటు డిపాజిట్ చేయ‌వ‌ల‌సిందిగా బ్యాంకు కోర‌వ‌చ్చు. ఖాతా మూసివేసిన అనంత‌రం ఈ ప‌త్రాలు, చెక్కుబుక్కులు, కార్డులు మొద‌లైన వాటిని బ్యాంకు వారు నాశ‌నం చేస్తారు.

రుసుములు:

ఖాతా తెరిచిన 14 రోజుల లోపుగానే మూసివేసిన ఖాతాల‌కు బ్యాంకులు ఎటువంటి రుసుములు విధించ‌వు. 14 రోజుల నుంచి ఒక సంవ‌త్స‌రం లోపు మూసివేయు ఖాతాల‌కు రుస‌ములు విధించే అవ‌కాశం ఉంది. సాధార‌ణంగా ఒక సంవ‌త్స‌రం పైన నిర్వ‌హించిన ఖాతాల‌ను మూసివేయు స‌మ‌యంలో బ్యాంకులు ఎటువంటి రుసుములు విధించ‌వు.

ఖాతా బ్యాలెన్స్:

ఖాతాలో బ్యాలెన్స్ మొత్తం రూ. 20 వేల లోపు ఉంటే దానిని న‌గ‌దు రూపంలో చెల్లిస్తారు. ప్రత్యామ్నాయంగా బ్యాలెన్స్ మొత్తం చెల్లించ‌వ‌ల‌సిన ప‌ద్ద‌తిని ఖాతాదారుడు ఎంచుకోవ‌చ్చు. ఖాతాను మూసివేసేముందే అందులోని బ్యాలెన్స్‌ను మ‌రొక ఖాతాలోకి బ‌దిలీ చేసుకోవ‌డం మంచిది. మూసివేసిన‌ ఖాతా చివ‌రి అక్కౌంట్ స్టేట్‌మెంట‌ను మీ వ‌ద్ద ఉంచుకోవ‌డం మంచిది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to close a bank account?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0