Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Pay pending salaries by January 15!

జనవరి 15 లోగా పెండింగు జీతాలు ఇచ్చెయ్యండి!

Pay pending salaries by January 15!

ఆ తర్వాత వడ్డీ విషయం తేలుస్తాం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా కారణంగా కోత విధించిన రెండు నెలల పెండింగు జీతాలు జనవరి 15లోగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు తెలిసింది. అవి చెల్లించి వస్తే 12 శాతం వడ్డీ మాఫీ విషయంపై అప్పుడు తమ నిర్ణయం చెబుతామని పేర్కొన్నట్టు సమాచారం. ప్రాథమికంగా విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగులకు కరోనా కారణంగా మార్పి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన జీతాలు సగం మొత్తం ప్రభుత్వం నిలిపివేసింది. పెన్షనర్లకు ఒక నెల సగం పెన్షన్ నిలిపివేసింది. దీనిపై ఆప్పట్లో ఒక విశ్రాంత జిల్లా మేజిస్టేరేట్ హైకోర్టును ఆశ్రయించగా పెండింగు జీతాలు రెండు నెలల్లోగా 12శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అక్టోబర్ 12తో ఆ గడువు తీరిపోయింది. ఈ వడ్డీ చెల్లించలేమంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అది ఈ రోజు విచారణకు వచ్చినట్లు సమాచారం. పెండింగు జీతాలు చెల్లించగలం కానీ, వడ్డీ చెల్లించలేమని ప్రభుత్వ తరపు న్యాయవాదులు పేర్కొన్నట్లు సమాచారం. ఎప్పటిలోగా పెండింగు జీతాలు చెల్లించగలరని న్యాయస్థానం ప్రశ్నించిందని తెలిసింది. రెండు నెలల్లోగా పెండింగు మొత్తం చెల్లిస్తామని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పగా జనవరి 15 లోపు పెండింగు జీతాలు ఇచ్చెయ్యాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆ మొత్తాలు చెల్లించిన తర్వాత వడ్డీ విషయంలో తమ నిర్ణయం చెబుతామని పేర్కొన్నట్లు సమాచారం. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఈ విషయం తెలిసింది. సుప్రీంకోర్టు ఆర్డరు కాపీ అందిన తర్వాత పూర్తి సమాచారం తెలుస్తుంది.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Pay pending salaries by January 15!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0