Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Private schools are advised not to tell teachers non-professional tasks and private schools not to send teachers to students 'parents' homes for admissions.

 ప్రైవేట్ స్కూళ్లు టీచర్లకు వృత్తికి సంబంధం లేని పనులు చెప్పవద్దని, ప్రైవేట్ స్కూళ్లు టీచర్లను అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల ఇళ్లకు పంపించవద్దని సూచించింది.

Private schools are advised not to tell teachers non-professional tasks and private schools not to send teachers to students 'parents' homes for admissions.

జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులకు కూడా మెరుగైన విద్య అందించేందుకు ఎంతో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రైవేటు కళాశాను తలదన్నే విధంగా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి తీసుకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి సర్కా. ప్రైవేట్ పాఠశాలల విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులకు వృత్తికి సంబంధంలేని పనులు చెయ్యొద్దు అంటూ ఇటీవల జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

సాధారణంగా అయితే ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ తమ పాఠశాలలో అడ్మిషన్లు ఎక్కువగా తీసుకోవడానికి ఏకంగా ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులను ప్రాధేయ పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

ఇక అలా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ ఉండటం వల్ల విద్యార్థుల తల్లిదండ్రుల్లో కాస్త చులకన బావం ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇటీవలే ఈ విషయం పై కీలక ఆదేశాలు చేసిన జగన్ సర్కార్ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులకు సంబంధం లేని పనులు చెప్పకూడదు అంటే ఆదేశించింది.

అడ్మిషన్ల కోసం విద్యార్థులకు విద్యా బోధన చేసే ఉపాధ్యాయులను విద్యార్థుల ఇంటికి పంపవద్దు అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఎవరైనా తమ పాఠశాలలో పిల్లలను చేర్చాలంటు ఇంటికి వస్తే.. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటూ తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు, అమ్మ ఒడి, విద్య దీవెన, విద్య కనుక వంటి పథకాల ద్వారా అభివృద్ధి చేస్తున్న జగన్ సర్కార్ ప్రైవేట్ పాఠశాలల డోర్ టు డోర్ క్యాంపెయిన్ పై కూడా పరోక్షంగా నిషేధం విధించింది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Private schools are advised not to tell teachers non-professional tasks and private schools not to send teachers to students 'parents' homes for admissions."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0