Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI vs HDFC VS ICICI Bank: Hugely reduced home loan interest rates ... very clear in any bank.

 SBI vs HDFC VS ICICI Bank : భారీగా తగ్గిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు ... ఏ బ్యాంకులో ఎంతో వివరణ.

SBI vs HDFC VS ICICI Bank: Hugely reduced home loan interest rates ... very clear in any bank.

మీ సొంతింటి కల సాకారం చేసుకునేందుకు ఇదే అత్యద్భుత ముహూర్తం. గత 15 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వడ్డీకి గృహ రుణాలు (home loans) లభిస్తున్నాయి. అంతేకాదు ఆకర్షణీయమైన అతి తక్కు వ వడ్డీ రేట్లు వసూలు చేస్తున్న పలు బ్యాంకులు బంపర్ ఆఫర్లతో ఊరిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకులు ఇటీవలే హోమ్ లోన్లపై వడ్డీని సవరిస్తూ బాగా తగ్గించాయి. పండుగ సీజన్ కూడా కావడంతో ఇళ్ల కొనుగోళ్లకు సరైన సీజన్ కూడా కావడంతో బ్యాంకులు ఇలా కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి హోమ్ లోన్లపై వడ్డీ ఒకటిన్నర దశాబ్దకాలంలో కనిష్టానికి పడిపోయింది. ఓవైపు స్థిరాస్థి ధరలు నేలచూపులు చూస్తుండగా మరోవైపు అదనపు డిస్కౌంట్లు ఇస్తున్న రియాల్టీ డెవలపర్స్ సొంతిల్లు కొనాలనుకునే వారికి గాలం వేస్తున్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెట్స్ వైస్ ఛైర్మన్ సంతోష్ కుమార్ విశ్లేషించారు.

మనదేశంలో అత్యధిక రుణాలు ఇచ్చే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా గృహ రుణాలపై వసూలు చేసే వడ్డీలను తగ్గిస్తూ భారీ రాయితీలు ప్రకటించింది. రూ.30,00,000/-వరకు తీసుకునే హోమ్ లోన్స్ పై 6.90శాతం వడ్డీ వసూలు చేస్తుండగా 30 లక్షలకంటే ఎక్కువ మొత్తంలో తీసుకునే హోమ్ లోన్స్ పై 7శాతం వడ్డీ వసూలు చేస్తోంది. 75 లక్షలకంటే ఎక్కువ మొత్తాలను స్టేట్ బ్యాంక్ లో గృహ రుణంగా తీసుకుంటే వారికి 25 బేసిస్ పాయింట్స్ కన్సెషన్ లభిస్తుంది. కానీ ఇవన్నీ మీ సిబిల్ స్కోర్ పై మాత్రమే ఆధారపడి ఉంటాయి

ఫెస్టివ్ ఆఫర్ ను మరికొన్ని రోజులపాటు పొడగించిన ఎస్ బీఐ క్రెడిట్ స్కోర్ ఆధారంగా గతంలోలా 10 bps కన్సెషన్ కాకుండా ఏకంగా 20 bps వరకూ కన్సెషన్ ఇస్తోంది. ఈ ఆఫర్ 30 లక్షలనుంచి 2 కోట్ల రూపాయల హోమ్ లోన్స్ కు వర్తిస్తుందని ఎస్ బీఐ స్పష్టం చేసింది. ఇదే కన్సెషన్ ను 3 కోట్ల రూపాయల రుణాల వరకు వర్తించేలా 8 మహా నగరాల్లో అందుబాటులోకి తెచ్చింది. అదనంగా 5 bps కావాలనుకుంటే ఎస్‌బీఐ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటిగ్రేటెడ్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ ఫామ్ YONO ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక హోమ్ లోను తీసుకునే మహిళలకు ప్రత్యేకంగా మరో 5 bps ఇంట్రెస్ట్ కన్సెషన్ కూడా లభిస్తుంది.

కొటక్ మహీంద్ర ప్రవేశపెట్టిన ఫెస్టివ్ లోన్స్ ఏడాదికి 6.9శాతం వడ్డీ రేట్లతో ప్రారంభమవుతుండడం విశేషం. ఇతర బ్యాంకుల్లో హోమ్ లోన్ తీసుకున్నవారు తమ రుణాన్ని కోటక్ మహీంద్ర బ్యాంకుకు ట్రాన్స్ ఫర్ చేసుకుంటే ఏకంగా 20 లక్షల వరకు రాయితీలు పొందే సదుపాయన్ని కల్పిస్తోంది. మహిళలకు కోటక్ మహీంద్రా ఆకర్షణీయమైన స్వల్ప వడ్డీ రుణాలు అందుబాటులోకి తెచ్చింది.

హౌజింగ్ లోన్స్ పై బ్యాంక్ ఆఫ్ బరోడా సరికొత్త రాయితీలు ప్రకటిస్తూ ఏకంగా 15 బేసిస్ పాయింట్స్ ను తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో హోమ్ లోన్లు 6.85శాతానికే అందుబాటులోకి వచ్చి కస్టమర్లను ఊరిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి వారిని ఆకట్టుకునేలా ఈ ఆఫర్ ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI vs HDFC VS ICICI Bank: Hugely reduced home loan interest rates ... very clear in any bank."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0