Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Merging of all schhools function under Panchayat Raj limits in munsipality-instructions*

 Merging of all schhools function under Panchayat Raj limits in munsipality-instructions

Merging of all schhools function under Panchayat Raj limits in munsipality-instructions*


మున్సిపాలిటీల్లో

 పాఠశాలల విలీనం కుదరదు  

పాఠశాల విద్య డైరెక్టర్ ఉత్తర్వుల జారీ

 ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపాలిటీల పరిధిలోని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల విలీనం కుదరదని రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్ వాడరేవు చిన వీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. 

మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలను వీటికి ఉన్న ఆస్తులను మున్సిపల్ యాజమాన్యంలో విలీనం చేయాలని కోరుతూ పురపాలక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ ఉత్తర్వుల ఆధారంగా మున్సిపాలిటీల పరిధిలోని పంచాయతీ రాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఒకే పాఠశాలలో ఎనిమిది సంవత్సరాలు పూర్తియి తప్పనిసరిగా బదిలీ కావాలి. 

అయితే హైకోర్టును ఆశ్రయించి అదే స్థానాల్లో వారిని కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు పొందారు. ఈ విషయంలో స్పందించిన పాఠశాల విద్య కమిషనర్ ఆ పాఠశాలలు ఇంకా మున్సిపాలిటీల యాజమాన్యంలో విలీనం కాలేదని పేర్కొన్నారు. ఆ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాద్యాయులను మున్సిపల్ యాజమాన్యానికి బదలాయిస్తూ తాము ఎటువంటి ఉత్తర్వులు జారీచేయలేదని పాఠశాల విద్య డైరెక్టర్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎనిమిదేళ్ళ సర్వీసు పూర్తయినవారు తప్పనిసరిగా బదిలీ కావాల్సిందేనని, ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాలను ఖాళీలుగా చూపించాలని పాఠశాల విద్య డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ద్వారా ఎటువంటి న్యాయ పరమైన వివాదాలు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా మున్సిపా లిటీల పరిధిలోని పంచాయతీరాజ్ పాఠశాలలను ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపల్ యాజమాన్యానికి బదిలీ చేయడం కుదరదని డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు..

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Merging of all schhools function under Panchayat Raj limits in munsipality-instructions*"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0