Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP housing Scheme: CM Jagan tells good news to the homeless poor.

 AP housing Scheme : ఇళ్ల పట్టాలు రాని పేదలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.

AP housing Scheme: CM Jagan tells good news to the homeless poor.

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' పథకం కింద 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందిస్తోంది. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఆ స్థలంలో మహిళల పేరుతో ఇళ్లు కూడా నిర్మించి ఇస్తారు. అయితే, ఇంకా చాలా మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు రాలేదు. లబ్ధిదారుల జాబితాలో వారి పేర్లు లేవు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందంటూ కొందరు పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీపికబురు చెప్పారు. అర్హత ఉన్నా కూడా ఇళ్ల పట్టాల లబ్ధిదారులుగా ఎంపిక కాని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి 90 రోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. ఇళ్ల పట్టాల కేటాయింపు అనేది నిరంతర ప్రక్రియ అని జగన్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ కోసం 66,518 ఎకరాలు సేకరించామని జగన్ తెలిపారు. రాబోయే మూడు సంవత్సరాల్లో ఇళ్లు కాదు, ఊళ్లు ఏర్పడతాయని జగన్ అన్నారు. ప్రస్తుతం సేకరించిన ఇళ్ల స్థలాల్లో తొలిదశలో 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఆ తర్వాత రెండో దశలో ఇళ్లను నిర్మిస్తామన్నారు. 37.50 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం రూ.54,940 కోట్లు ఖర్చవుతుందన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగలా నిర్వహించనున్నారు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్ మూడు ఆఫర్లు ఇచ్చారు.

ఆప్షన్ 1. ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి నాణ్యమైన సామగ్రి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్ చార్జీలు లబ్ధిదారుల చేతికి ఇస్తుంది. మీరే దగ్గరుండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు.

ఆప్షన్ 2. నిర్మాణ సామగ్రి లబ్ధిదారులు స్వయంగా కొనుక్కోవచ్చు. ఇల్లు కట్టుకోవచ్చు. దీనికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. బేస్‌మెంట్‌కి కొంత, పిల్లర్స్‌కి కొంత, స్లాబ్‌కి కొంత, ఇలా విడుతల వారీగా నిధులు మంజూరు చేస్తారు.

ఆప్షన్ 3. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వడం.

ఇప్పటికీ న్యాయ పరమైన చిక్కుల వల్ల 3.7 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించలేకపోతున్నామని, వారికి కూడా లీగల్ సమస్యలు తీరిన వెంటనే ఇళ్ల పట్టాలు అందజేస్తామన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP housing Scheme: CM Jagan tells good news to the homeless poor."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0