Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jagananna Ammavadi

 వడపోత షురు

Jagananna Ammavadi

  • చిరుద్యోగుల పిల్లల పేర్లు తొలగింపు
  • సిఎంఆర్‌ఎఫ్‌ వేతనదారులూ దూరం

చిరుద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఒకటొక్కటిగా దూరం అవుతున్నాయి. తాజాగా నూతన సంవత్సరం 2021లో అమలు చేయనున్న అమ్మ ఒడి పథకంలో లబ్ధిదారుల ఒడపోత కార్యక్రమాన్ని జిల్లా యంత్రాగం మొదలెట్టింది. జిల్లాలో 2019-20 విద్యా సంవత్సరంలో మొత్తం 6,97,896 మంది విద్యార్ధులు వివిధ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో విద్యనభ్యసిస్తుండగా, వారిలో 5,16,295 మందికి అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేశారు. 2020-21లో 5,34,298 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ మొత్తంలో వివిధ కారణాలతో 80,936 మందిని ఇన్‌వెలిజిబుల్‌గా పక్కన పెట్టారు.

దీంతో గతేడాది కన్నా లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. 4,53,362 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు . జిల్లా యంత్రాంగం ఈ జాబితాను సైతం మరో సారి వడపోస్తోంది. తుది జాబితా సిద్దం అయ్యే (డిసెంబర్‌ 31 నాటికి) మరింత మంది పథకానికి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చిరుద్యోగులు పథకానికి దూరం

ఈ ఏడాది గతేడాది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ భిన్నంగా జరుగుతోంది. గతేడాది అంగన్‌వాడీ, మిడ్‌డే మీల్స్‌, ఆశ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లోనూ, గ్రామ, వార్డు సచివాలయాల్లో తక్కువ వేతనాలు పొందే ఉద్యోగులకు ఈ పథకాన్ని వర్తింప చేశారు. ఈ ఏడాది మాత్రం ఆంక్షల కొరడా జుళీపించారు. వీరందరి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కాంప్రహెన్సీవ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టం (సిఎఫ్‌ఎంఎస్‌) ద్వారా వేతనాలు తీసుకునే వారందరూ ఈ ఏడాది ఈ పథకానికి దూరం చేస్తున్నారు.

ఇలా కూడా కోతలు

తెల్లరేషన్‌ కార్డులు ప్రమాణికంగా పేద లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేయడం అనవాయితీగా వస్తోంది. అయితే వివిధ కారణాలతో ఇన్‌కంటాక్సు రిటన్స్‌ దాఖలు చేసిన వారి రేషన్‌ కార్డులను తొలగించారు. బతుకుతెరువుకు ఫైనాన్స్‌లో నాలుగు చక్రాల వాహనాలు కొనుక్కుని కిరాయికి తిప్పుకునే వారివి, 300 యూనిట్లకుపైగా విద్యుత్తు వినియోగించే చిరు వ్యాపారుల కార్డులు అమ్మఒడి పథకం నుంచి మినహాయిస్తున్నారు. నెలకు 300 యూనిట్లకుపైగా విద్యుత్తు వినియోగించిన వారు, నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నవారు, ఇన్‌కంటాక్సు రిటన్స్‌ కలిగి ఉన్న వారితో పాటుగా, 10 వేల వేతనంపైగా అందుకునే ఉద్యోగులు, చిరుద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Jagananna Ammavadi "

  1. Anno.....jagananna......koti koti vandanalanno....chiru udyogula saakuto notlo dummukottav kadanna.

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0