Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Central Government jobs with Inter qualification can be applied immediately by those who are eligible for only a few days.

 ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు  కొద్దిరోజులు మాత్రమే అర్హత కలిగినవారు వెంటనే అప్లయ్ చేసుకోగలరు.

Central Government jobs with Inter qualification can be applied immediately by those who are eligible for only a few days.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఉద్యోగాల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్‌ఎస్‌ఎసీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ (సిహెచ్‌ఎస్‌ఎల్) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఉద్యోగాలకు డిసెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజనల్ క్లర్క్ (ఎల్‌డిసి), జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (జేఎస్‌ఏ), పోస్టల్ అసిస్టెంట్ (పిఏ), సార్టింగ్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), డేటా ఎంట్రీ ఆపరేటర్ (డిఈఓ) పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్షలు 2021 ఏప్రిల్‌ 12 నుంచి 27 వరకు జరుగనున్నాయి.

దరఖాస్తు చేసుకునే విధానం:ఆసక్తిగల అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ (సిహెచ్‌ఎస్‌ఎల్) ఎగ్జామినేషన్‌కు దరఖాస్తు చేయడానికి రెండు భాగాలు ఉంటాయి. అందులో ఒకటి వన్‌ టైమ్ రిజిస్ట్రేషన్. రెండోది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం.

వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ అవసరం. వీటికి ఓటీపీ వస్తాయి. ఆధార్ నెంబర్, ఓటర్ ఐడీ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కాలేజ్ లేదా స్కూల్ ఐడీ, ఎంప్లాయర్ ఐడీ లాంటి డాక్యుమెంట్స్ ఉండాలి.

అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్టర్ నవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అందులో అభ్యర్దుల పేరు, పుట్టిన తేదీ, చిరునామా వివరాలు ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత డిక్లరేషన్ ఫిల్ చేయాలి. తరువాత మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ కావొచ్చు. లాగిన్ అయిన తర్వాత మీ వివరాలు చూపిస్తుంది. ఆ వివరాలను ఎడిట్ చేయొచ్చు.

వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ (సిహెచ్‌ఎస్‌ఎల్) నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం https://ssc.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి. ఆ తర్వాత ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. ఫీజు చెల్లింపుతో దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. ఫీజు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు ఫారమ్ ప్రింట్ తీసుకోవాలి. 2020 డిసెంబర్ 15 రాత్రి 11.30 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం. డిసెంబర్ 17 రాత్రి 11.30 గంటల్లోగా ఫీజు చెల్లించవచ్చు.

పరీక్ష కేంద్రాలు:

ఏపీ: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం

తెలంగాణ:హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌

పరీక్ష తేదీలు: టైర్‌-1 21 ఏప్రిల్‌ 2021 నుంచి 27 వరకు, టైర్‌-2 తేదీని తరువాత ప్రకటిస్తారు.

అధికారిక వెబ్‌సైట్‌:https://ssc.nic.in/


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Central Government jobs with Inter qualification can be applied immediately by those who are eligible for only a few days."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0