Commissioner regarding Amma Odi program ... their new guidelines for school education ...
అమ్మ ఒడి కార్యక్రమానికి సంబంధించి కమిషనర్... పాఠశాల విద్య వారి నూతన మార్గదర్శకాలు...
ప్రధానోపాధ్యాయుని బాధ్యతలు
- ప్రధానోపాధ్యాయులకు విద్యార్థుల యొక్క ఆధార్ నంబర్లను మార్పు చేయుటకు అవకాశం కల్పించబడినది
- ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నటువంటి తల్లుల యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్లను ఐఎఫ్ఎస్సి కోడ్ లను మార్పు చేయుటకు ప్రధానోపాధ్యాయులు తగిన అవకాశం కల్పించబడినది
- కావున ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నటువంటి ఏ తల్లి కూడా అవకాశం కోల్పోకుండా ప్రతి తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు & ఐఎఫ్ఎస్సి కోడ్ ను సరిచూసుకొని ఏమైనా మార్పులు ఉన్నట్లయితే వెంటనే అప్డేట్ చేయవలెను.
- ప్రధానోపాధ్యాయులు ఎలిజిబుల్ లిస్ట్ ను పరిశీలించి ఎవరైనా ఎలిజిబుల్ కానివారు ఉన్నట్లైతే వారిని ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ లోకి మార్చ వలెను
- ప్రధానోపాధ్యాయుల లాగిన్ నందు అనాధ విద్యార్థుల యొక్క వివరాలను ఎనేబుల్ చేయడం జరిగింది వారి వివరాలను పరిశీలించి అనాధ విద్యార్థులతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వివరాలను సిద్ధంగా ఉంచుకొనవలెను
గ్రామ సచివాలయం సిబ్బంది బాధ్యతలు
ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్న విద్యార్థుల / తల్లి యొక్క వివరాలను సబ్మిట్ చేసి ఎలిజిబులిటీ ఉన్నటువంటి అందరిని ఎలిజిబుల్ లిస్ట్ లోకి వచ్చే విధంగా చూడాలి.
0 Response to "Commissioner regarding Amma Odi program ... their new guidelines for school education ..."
Post a Comment