Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

For teachers to approve ..

 ఉపాధ్యాయులు ఆమోదించేలా..

For teachers to approve ..

  • అందరికీ మేలు జరిగేలా బదిలీలపై ముమ్మర కసరత్తు
  • సాంకేతిక సమస్యలకు పరిష్కారం
  • వెబ్ ఆప్షన్ కు మరో అవకాశం
  • ఎంఈఓ పర్యవేక్షణలో చేర్పులు మార్పులు
  • ఎమ్మార్సీలో ప్రత్యేక కౌంటర్లు

 ఉపాధ్యాయులందరికీ ఆమోదకరమైన రీతిలో బదిలీలపై ముందుకెళ్లాలని విద్యాశాఖాధికారు లకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సం ఘాల నాయకులు, ఉపాధ్యాయులు లేవనెత్తిన సమస్య లపై విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్(సర్వీసెస్) డి.దేవానం దరెడ్డి ఎప్పటికప్పుడు తగిన సమాచారంతో కూడిన వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా అం దరికీ చేరవేస్తూ వారిలో ఆందోళన తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెబ్ ఆప్షన్ల నమోదులో తలెత్తిన సమస్యలకు పరిష్కారం చూపేలా జిల్లా విద్యాశాఖాధికారులు దృష్టి సారించారు. బదిలీ కోసం ఆప్షన్ల నమోదులో తలెత్తిన తప్పిదాలను సరిచేసుకునేందుకు ఉపాధ్యాయులకు అవకాశం కల్పిస్తూ, తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ వి.చినవీరభద్రుడు ఉత్తర్వులుజారీ చేశారు. ఇందుకనుగుణంగా జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాట్లు చేయాలని ఎంఈఓలకు డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి సూచించారు

జిల్లాలో తాజా గణాంకాల మేరకు 5,142 మంది బదిలీ కోసమని దర ఖాస్తు చేసుకున్నారు. వీరిలో 5,005 మంది వెబ్ ఆప్షన్ నమోదు చేశారు ఆప్షను ఇచ్చిన వారు సైతం రెండు మూడుసార్లు నమోదు చేయటం, సర్వ ్ పనిచేయక కొంతమంది ఇంకా వెబ్ ఆప్షన్ ఇవ్వకపోవటంతో ఇటువంటి వారి కోసం మరో అవకాశం కల్పించారు

వెబ్ ఆప్షన్ లో చేర్పులు మార్పుల కోసమని ఈ నెల 21,22 తేదీల్లో జిల్లాలోని అన్ని ఎమ్మార్సీలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ రెం డు రోజుల్లో ఎంఈఓ లాగిన్ ద్వారా మరోమారు బదిలీ కోసం వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పటికీ, స్పష్టతలేదని అనుమానంతో ఉన్న ఉపాధ్యా యులు లోపం ఏమిటనేది తెలియ జేస్తూ దరఖాస్తు అందజేయాలి

ఇటువంటి వారి కోసం ఈ నెల 23 నుంచి 31వరకు ఎంఈఓ లాగిన్ ద్వా రా చేర్పులు, మార్పులకు అవకా శం కల్పించారు. సర్వర్ సమస్యలను దృ షిలో ఉంచుకొని రోజుకు పది మంది మాత్రమే హాజరయ్యేలా ఉపాధ్యాయ ల సెల్ ఫోన్లుకు మెసేజ్ పంపిస్తారు.

ఎమ్మార్సీకి హాజరయ్యే ఉపాధ్యా యుడికి ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తారు వెబ్ ఆప్షన్ చేర్పులు, మార్పులు కేవలం ఎమ్మార్సీలోనే చేయాల్సి ఉంటుంది బయట నెట్ సెంటర్లకు వెళ్లరాదు.

డెప్యూటీ డీఈఓలు దీనిని పర్యవే క్షణ చేస్తూ, ఏ రోజుకారోజు నివేదిక లను డీఈఓకి అందజేయాలి. వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులంతా సంతృప్తి చెందిన తరువాతనే ఉత్తర్వులు జారీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "For teachers to approve .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0