Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inspiration Ranjint Singh Disala

 Ranjint Singh Disala

Inspiration Ranjint Singh Disala

ఉపాధ్యాయుడు అంటే తరగతికి పరిమితం అయ్యే వాడు కాదు..పుస్తకాలలో ఉండే పాఠాలను వల్లె వేసే వాడు కాదు..ఉపాధ్యాయుడు ఒక సామాజిక వైద్యుడు..

సామాజిక రుగ్మతలకు వైద్యం చేసే వాడు ఉపాధ్యాయుడు..అని బలంగా నమ్మి దానిని ఆచరణలో చూపి ప్రపంచం మొత్తం తన వైపు చూసేలా చేసాడు రంజిత్ సింగ్.

ఆయన ఇరవయ్యో శతాబ్దపు ఉపాధ్యాయుడు. ఆయన బోధిస్తున్నది 21వ శతాబ్దపు పౌరులకు.

పాఠాలు చెప్పే విధానంలో చాలా గొప్ప మార్పులు తీసుకువచ్చాడు . సిలబస్‌ పందొమ్మిదవ శతాబ్దంలో, సాంకేతిక విధానం 18వ శతాబ్దంలోనే ఉండిపోయింది. అలా ఉండిపోకూడదు అని. 

కొత్త సాంకేతిక విధానాన్ని అవలంబిస్తు ప్రపంచ గుర్తింపు పొందాడు రంజింత్ సింగ్ దిసాలా 

ప్రపంచం మొత్తం మీద ఉపాధ్యాయ వృత్తిలో అద్భుత ప్రతిభను కన పరిచే వాళ్లకు 2014 సం నుండి "వర్కే ఫౌండేషన్ గ్లోబల్ టీచర్" అవార్డ్ ను అందిస్తూ ఉంది.దానిలో భాగంగా 2020 సం లో 140 దేశాల నుండి 12 వేల మంది పోటీ పడగా చివరకు నిలచిన 10 మందిలో మహారాష్ట్రకు చెందిన భారతీయ ఉపాధ్యాయుడు అత్యున్నత పురస్కారం సాధించాడు..ఈ పురస్కారం ఆయనకు దక్కడం వెనుక ఆయన కృషి చూద్దాం.. 

మహారాష్ట్ర సోలాపూర్‌ జిల్లా పరిత్వాడి గ్రామంలో జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో 3, 4 తరగతులకు మరాఠి మాధ్యమంలో బోధిస్తారు రంజిత్‌. 2009లో విధుల్లోకి చేరారు.శిథిలావస్థలో ఉన్న భవనం, స్టోరు రూములో పశువుల కొట్టం ఉన్న స్కూలులో ఆయనకు పోస్టింగ్‌ వచ్చింది. ఆ భవనాన్ని బాగు చేయించి, పాఠాలు మొదలుపెట్టారు. ఆ స్కూల్లో బాలికల హాజరు శాతం చాలా తక్కువగా ఉండడం గమనించారాయన. ఆ ప్రాంతంలో ఆదివాసీ తెగలు ఎక్కువగా ఉన్నాయి. ఆ కుటుంబాల బాలికలు విద్యకు దూరంగా ఉండడం, బాల్య వివాహాలకు గురికావడం ఆయన దృష్టికి వచ్చింది. వారి మాతృభాష కన్నడలో పాఠ్యాంశాలు లేకపోవటం కూడా ఆ పిల్లల అనాసక్తి మరొక కారణంగా గ్రహించారు. స్వయంగా ఆ భాష నేర్చుకుని మరాఠీలో ఉన్న పాఠ్యాంశాలను కన్నడలోకి తర్జూమా చేశారు రంజిత్‌. అలా ఆ పిల్లల హాజరు మెరుగుపడింది. మాతృభాషలో పాఠాలు నేర్చుకోవటం వారిలో ఆసక్తిని పెంచింది.

రంజిత్‌కి తరగతి గదే ఓ ప్రపంచం. అనేక ప్రయోగాలకు నిలయం. ప్రతి పాఠ్యాంశానికి ఆడియో కవితలు, ఉపన్యాసాలు, కథలు జోడించేవారు. బాలికలను విద్య వైపు ఎంతలా ప్రోత్సహించారంటే చాలా కాలంగా ఆ ప్రాంతంలో ఒక్క బాల్యవివాహం కూడా జరగలేదు. స్కూలుకు వచ్చే బాలికల్లో వందశాతం హాజరు ఉంటుంది. జిల్లాలోనే వందశాతం విద్యార్థుల హాజరుతో ఆయన పనిచేస్తున్న స్కూలు ప్రథమ స్థానంలో నిలబడింది కూడా.

పాఠశాలలో క్యుఆర్‌ కోడ్‌ విధానాన్ని ప్రవేశపెట్టడమే కాక, సాంకేతికతను ఉపయోగించి పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు రంజిత్‌. వారి ప్రాంతంలో చెట్ల నరికివేతగా ఎక్కువగా జరిగేది. రైతులు తమ సొంత పనుల నిమిత్తం వాటిని తొలగించేవారు. రంజిత్‌ విద్యార్థుల సాయంతో తమ ప్రాంత చెట్ల పూర్తి సమాచారాన్ని సేకరించారు. ఆ చెట్లకు సెన్సార్లను అమర్చారు. ఎవరైనా ఆ చెట్లను నరకడానికి ప్రయత్నిస్తే ఆ చెట్టును దత్తత తీసుకున్న విద్యార్థికి ఆ విషయం తెలిసిపోతుంది. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని చెట్టును తొలగించకుండా కాపాడగలుగుతున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో చెట్టు నరకడం అనివార్యమైతే దానికి బదులుగా ఐదు మొక్కలను నాటాలని ప్రచారం చేశారు. వాటిని కనీసం మూడేళ్లపాటు సంరక్షించాలి. దీనికి ఆ ప్రాంత రైతులు కూడా సహకరిస్తున్నారు. రంజిత్‌ తోడ్పాటుతో విద్యార్థులు చెట్లను కూడా క్యుఆర్‌ కోడ్‌తో అనుసంధానించారు. వాటిని స్కాన్‌ చేసినప్పుడు ఆ చెట్టు పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణకు రంజిత్‌ చేస్తున్న కృషి ఎందరో ప్రముఖుల ప్రశంసలందుకుంది. క్రమంగా ఆ ప్రాంతంలో చెట్ల నరికివేత గణనీయంగా తగ్గింది. వర్షాభావ ప్రాంతమైన సోలాపూర్‌ పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంది. 

నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ద్వారా రంజిత్‌ను సంప్రదించి ఇటలీ,జపాన్‌,వియత్నాం, కాంబోడియా,ఫ్రాన్స్‌ దేశాలు ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాయి.

రంజిత్‌ తనకు లభించిన గ్లోబల్‌ టీచరు అవార్డు_సొమ్ము 7.38 కోట్ల లో తనతో పాటు ఫైనల్‌_లిస్ట్‌కు చేరిన 9 మందికి 50 శాతం ఇస్తున్నారు. మిగతా సొమ్ముతో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి పాఠశాలలు, వెనుకబడిన తరగతుల విద్యార్థుల స్వావలంబన కోసం ఖర్చు చేస్తానని చెప్పారు.

రంజిత్‌ సిన్హ్‌ లాంటి ఉపాధ్యాయులు వాతావరణ మార్పుల వంటి సమస్యలకు పరిష్కారం చూపగలరు. ప్రశాంతమైన సమాజాన్ని నిర్మించగలరు. అసమానతలను రూపుమాపి.. ఆర్థిక వృద్ధికి తోడ్పాడునందిస్తారు. మొత్తంగా చెప్పాలంటే ఇలాంటివారు మన భవిష్యత్తునే మార్చగలరు’’ అని #యునెస్కో_అసిస్టెంట్‌_డైరెక్టర్‌ జనరల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ స్టెఫానియా జియాన్నిని రంజిత్ సింగ్ ను అభినందించారు. భారతీయ టీచర్ గ్లోబల్ అవార్డ్ సాధించిన శుభ సందర్భంగా రంజిత్ కు అభినందనలు తెలుపుదాం.. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ప్రతీ ఒక్కరూ రంజిత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకుందాం..

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Inspiration Ranjint Singh Disala"

  1. జయహో రంజిత్ సింగ్ దివాలే🙏🙏🙏🌷🌷🌷👍👍👍

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0