Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Inter exams in March

మార్చిలో ఇంటర్ పరీక్షలు

Inter exams in March

  • విద్యా సంవత్సరం తాత్కాలిక క్యాలెండర్ విడుదల
  • సంక్రాంతి సెలవులు, రెండో శనివారం సెలవు రద్దు
  • గందరగోళంగా ప్రథమ సంవత్సర విద్యార్థుల పరిస్థితి

కరోనా మహమ్మారి కారణంగా ఈ విద్యాసంవత్సరం చదువులు గందరగోళంగా సాగుతున్నాయి ప్రధానంగా ఇంటర్ విద్యార్థుల పరిస్థితి అయోమయంగా ఉంది. ఈ ఏడాది ఇంటర్ విద్య వార్షిక తాత్కాలిక క్యాలెండర్ ను సోమవారం ఇంటర్ విద్యా మండలి విడుదల చేసింది. దాని ప్రకారం సీనియర్ ఇంటర్ విద్యార్థులకు నవంబరు 2వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు 138 రోజులు పనిదినాలుగా నిర్ణయించింది. ఈ నెలలో రెండో యూనిట్ పరీక్షలు, జనవరి నుంచి 9 వరకు అర్ధ సంవత్సర పరీక్షలు నిర్వహించనుంది. 3,4 యూనిట్ టెను కళాశాలల వెసులుబాటును బట్టి నిర్వహించుకోవచ్చు. ప్రీ ఫైనల్ పరీక్షలు మాత్రం ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహిస్తారు. కాగా, ఈ విద్యా సంవత్సరంలో సంక్రాంతి, రెండో శనివారం సెలవు లేదు. సీనియర్ ఇంటర్ విద్యార్థులకు మార్చి మొదటి వారంలో ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమ వుతాయి, అదే నెల చివరి వారంలో పబ్లిక్ పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి

ఫస్టియర్ పరిస్థితేంటి

ద్వితీయ సంవత్సరంతోపాటు, ప్రథమ సంవత్సరం వార్షిక క్యాలెండర్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇంటర్ బోర్డు ఆర్ఐవో మాల్యాద్రి చౌదరి మాత్రం ప్రథమ సంవత్సరం క్యాలెండర్ ఇంకా విడుదల కాలేదని చెబుతున్నారు. దీంతో ఫస్టియర్ విద్యార్థులు గందరగోళానికి గురవు తున్నారు. కాగా, సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన ప్రథమ సంవత్సర వార్షిక క్యాలెండర్ ప్రకారం నవంబరు 16 నుంచి 127 పని దినాలని, మార్చి చివరి వారంలో పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని ఉంది. అసలు అడ్మిషన్ ప్రక్రియే ఇప్పటి వరకు పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే వార్షిక క్యాలెండర్ తో వారు ఆందోళన చెందుతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Inter exams in March"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0