Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

LPG Cylinder Prices :

 LPG Cylinder Prices : గ్యాస్ సిలిండర్ ధర పెంపు.

LPG Cylinder Prices :

న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్ సైట్ ప్రకారం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర డిసెంబర్ నెలలో పెరిగింది. 14.2 కిలోల సిలిండర్ ధర అన్ని ప్రధాన నగరాల్లో రూ.50 పెరిగింది. ధరలు దాదాపు 5 నెలలుగా పెరగలేదు. ఈ నెలలో రూ.50 పెరిగినట్లు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్ సైట్ చూపిస్తోంది.

ఐదు నెలలుగా పెరగకపోవడమే కాదు, గత మూడు నెలల పాటు ధరలు తగ్గాయి. జూన్, జూలై నెలల్లో ధరలు పెరిగాయి. చమురు రంగ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన ధరలను సమీక్షిస్తాయి. డిసెంబర్ మొదట్లోనే సమీక్షించాలి. అయితే ప్రారంభంలో ధరల్లో మార్పురాలేదు.

దేశ రాజధాని ఢిల్లీలో నవంబర్ నెలలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.594 కాగా, ఇప్పుడు రూ.50 పెరిగి రూ.644కు చేరుకుంది. కోల్‌కతాలో రూ.620.50 నుండి రూ.670.5కి, ముంబైలో రూ.594 నుండి రూ.644కు, చెన్నైలో రూ.610 నుండి రూ.660కి పెరిగింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతి నెల దేశీయ చమురు రంగ కంపెనీలు ధరలను సమీక్షిస్తాయి.

హౌస్ హోల్డ్స్‌కు ఏడాదికి 12 సిలిండర్లను సబ్సిడీ పైన కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అంతకుమించి కావాలంటే బహిరంగ మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలి. సబ్సిడీ ధరతో కొనుగోలు చేసినప్పటికీ సిలిండర్ డెలివరీ సమయంలో మార్కెట్ ధరను చెల్లించాలి. ఆ తర్వాత కస్టమర్ బ్యాంకు అకౌంట్లోకి సబ్సిడీ అందుతుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "LPG Cylinder Prices : "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0