Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New Year celebrations in AP canceled, statewide curfew on December 31 and January 1.

 ఏపీలో న్యూ ఇయర్ వేడుకలు రద్దు , డిసెంబర్ 31 , జనవరి 1 న రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ.

New Year celebrations in AP canceled, statewide curfew on December 31 and January 1.

  • డిసెంబర్ 31 జనవరి 1 వేడుకలు రద్దు 
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు
  • క్రిస్మస్ ,ముక్కోటి ఏకాదశి వేడుకలు యథాతథం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్త సంవత్సర వేడుకలను రద్దు చేసింది. డిసెంబర్ 31, జనవరి 1న వేడుకలను రద్దు చేసింది. ఆ రెండు రోజుల్లో రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి నిపుణులు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో జనవరి 15వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ మధ్యలో మరోసారి కరోనా విజృంభించే ప్రమాదముందని కేంద్ర వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగా ఈ నెల మూడో వారం నుంచి మరోసారి కట్టడి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో కరోనా సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా ప్రభుత్వం కొత్త సంవత్సర వేడుకలను నిషేధించనున్నట్లు తెలిసింది. ఈ నెల 26 నుంచి జనవరి 1 వరకూ అన్ని రకాల వేడుకలు రద్దు చేసే దిశగా ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబరు 31న, జనవరి 1న రాష్ట్రంలో పూర్తిగా కర్ఫ్యూ విధించాలని యోచిస్తోంది. వైన్‌ షాపులు, బార్ల సమయాల్ని కుదిస్తారు. విద్యా సంస్థలకూ కొన్ని సూచనలు ఇస్తారు.

విద్యార్థులకు సూచనలు

ప్రతి తరగతి గదిలో వేడి నీళ్లు కచ్చితంగా విద్యార్థులకు అందించాలి. మాస్కులు అందించడంతో పాటు శాని టైజర్‌ కచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. డిసెంబర్ 26 నుంచి టీచర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యా సంస్థల్లో పని చేస్తున్న సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది తది తరులు ప్రతి 15 రోజులకు ఒకసారి ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులు చేయించుకోవాలి.

పెళ్లిళ్లకు వంద మందే

పెళ్లిళ్లకు వంద మందికి మించి హాజరు కాకూడదు. రాజకీయ కార్యక్రమాలు, ప్రైవేటు ఈవెంట్లకు 200 మందికి అనుమతి ఉంటుంది. పెద్ద కర్మలకు 50 మంది, అంత్య క్రియలకు 20 మంది మించకూడదు. ఈ కార్యక్రమాలను ప్రభుత్వం సూపర్‌ స్ప్రెడర్స్‌గా పరిగణిస్తుంది. గతంలో ఇలాంటి వాటి వల్లే పదులు, వందల సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. ఈ సారి అలా కాకుండా.. ప్రజలు గుమిగూడే కార్యక్రమాలను పూర్తిగా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈ నిబంధనలు పెడుతోంది. స్విమ్మింగ్‌ పూల్స్‌, క్రీడా కార్యక్రమాలను ఫిబ్రవరి నెలాఖరు వరకూ పూర్తి నిషేధం విధించనుంది.

తొలి విడత లాక్‌డౌన్‌ సమయంలో మాదిరిగా కఠిన తర ఆంక్షలను ఇప్పుడు అమలు చేసే పరిస్థితి లేదు. జన సాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నిబంధనల అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెల 26వ తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రిసార్టులు, మార్కెట్లు, మాల్స్‌, సినిమా థియేటర్లలో కొన్ని ఆంక్షలు అమలు చేయనుంది. జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని బట్టి కంటైన్‌మెంట్‌ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి మార్కెట్‌ జోన్‌ను కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తారు. మిగిలిన ప్రాంతాల్లో కొంత వరకూ ప్రజలు పనులు చేసుకు నేందుకు అనుమతిస్తారు. ఇదే సమయంలో 65 ఏళ్లు పైబడిన వాళ్లు, గర్భిణులు, 10 ఏళ్ల లోపు చిన్నారులను ఇంటి వద్దనే ఉంచాలని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో హైరిస్క్‌ ఉన్న వారు తీసుకోవలసిన జాగ్రత్తలపై ముందుగానే సమాచార మిస్తారు. భౌతిక దూరం పాటించడంతో పాటు ప్రజలంతా మాస్క్‌, శానిటైజర్‌, మాస్కులను ఉపయోగించడం తప్పని సరి చేయనున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New Year celebrations in AP canceled, statewide curfew on December 31 and January 1."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0