Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Tenth Class exams in May Formative exams in January

 మే నెలలో పదో తరగతి పరీక్షలు జనవరిలో ఫార్మేటివ్ ఎగ్జామ్స్ 


  • 9,10 తరగతుల విద్యార్థులకు జనవరి 6,7 & 8  తేదీల్లో
  • 7 & 8తరగతులకు జనవరి 21,22 & 23 తేదీల్లో
  • ఫార్మేటివ్ -1 పరీక్షలు
  • ప్రతి నెలలో మొదటి, మూడో శనివారాలను No Bag Day  గా తప్పనిసరిగా అమలు.
  • మే నెలలో పదోతరగతి పరీక్షలు
  • జనవరిలో ఫార్మేటివ్ ఎగ్జామ్స్

 రాష్ట్రంలోని పాఠశాలల్లో ఏప్రిల్ 30 వరకు తరగతులు కొనసాగుతాయని, మే నెలలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుందని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్ బి.ప్రతాప్ రెడ్డి తెలిపారు. టెన్త్ పరీక్షల్లో ఎన్ని పేపర్లు ఉంటాయన్నది ఇంకా నిర్ణయం కాలేదని, దీనిపై ప్రభుత్వం, ఉన్నతాధి కారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రధానోపా ధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు తదితరులతో మంగళవారం యూట్యూబ్ ద్వారా సమావేశం నిర్వహించారు.

 జనవరిలో ఫార్మేటివ్ ఎగ్జామ్స్

9,10 తరగతుల విద్యార్థులకు జనవరి 6, 7, 8 తేదీల్లో ,7,8తరగతులకు జనవరి 21, 22, 23 తేదీల్లో ఫార్మేటి వ-1 పరీక్షలు ఉంటాయన్నారు. అన్ని స్కూళ్లలో ఏప్రిల్ వరకు తరగతులు నిర్వహిస్తారని, సిలబస్ పూర్తి చేయడానికి ఉపాధ్యాయులు హడావుడి పడాల్సిన పనిలేదని చెప్పారు. ఎస్సెస్సీ పరీక్షల్లో ఆప్షనల్ అంశాలు ఏమీ ఉండవని, సిలబస్ తగ్గించినందున అన్ని అంశాలనూ కూలంకషంగా బోధించాలన్నారు. తరగతుల్లో గైడ్లను అనుసరించి బోధన చేయకూడదని, అలా చేసే వారిపై చర్యలుంటాయని పేర్కొన్నారు. టెన్త్ తరువాత ఏం చేయాలన్న దానిపై విద్యార్థులు వారికి అభిలాష ఉన్న రంగాలను ఎంచుకునేలా ముందుగానే కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఎస్సీఈఆర్టీ నిర్వహిస్తోందని తెలిపారు. విద్యారంగంలో ప్రమాణాలు పెంచేందుకు పేదలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన చదువులు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇందుకోసం వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించారని వివరించారు. అందువల్ల ప్రతి పేద విద్యార్థికి న్యాయం జరిగేలా టీచర్లు కృషి చేయాలని కోరారు. దేశంలో మరెక్కడా లేనన్ని పథ కాలు రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తోందని, ప్రతి విద్యార్థి పాస్ కావడమే లక్ష్యంగా ఉపాధ్యా యులు ప్రణాళికా బద్దంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. నేషనల్ టాయ్ ఫెస్టివల్‌ను మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతి నెల లో మొదటి, మూడో శని వారాలను నో బ్యాగ్ డేగా తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Tenth Class exams in May Formative exams in January"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0