Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Cabinet approved several issues of the concluded AP Cabinet meeting

 ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ పలు అంశాలకు మంత్రివర్గం ఆమోదం.

The Cabinet approved several issues of the concluded AP Cabinet meeting

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది . రైతు భరోసా పథకం , ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది . ఇళ్ల పట్టాల పంపిణీ , పక్కా ఇళ్ల నిర్మాణంపై చర్చ జరగడంతో పాటు , ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటు ఆర్డినెన్సకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది . ఏపీ సర్వే అండ్ బౌండరీ చట్ట సవరణ , ఆంధ్రప్రదేశ్ పర్యాటక పాలసీని కేబినెట్ ఆమోదించింది . 6 జిల్లాల్లో వాటర్ షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది .

ఈ క్యాబినెట్ నిర్ణయాల గురించి మంత్రి పేర్ని నాని మీడియాకి సమాచారం ఇచ్చారు . మంత్రి చెప్పిన వివరాల ప్రకారం రైతు భరోసా మూడవ సీసన్ కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది . అలానే డిసెంబర్ 29 న రైతుల అకౌంట్ లో రైతు భరోసా వారి అకౌంట్ ల లో జమ చేయనున్నారు . అధిక వర్సాల మూలం గానో ప్రకృతి వైపరీత్యాల మూలం గా 1200 కోట్లు ఇన్పుట్ సబ్సిడి ని ఇప్పటికే చెల్లించామని నివర్ తుఫాన్ వల్ల బాధితులు నష్టపోయారో వారి కతాల్లోకి ఈ నెల 29 న 718 కోట్లు నేరుగా డబ్బు జమచేస్తామని మంత్రి పేర్కొన్నారు . పశుసంవర్ధక శాఖ లో కాంట్రాక్ట్ పద్ధతి లో పోస్ట్ లు భర్తీ కి కాబినెట్ లో నిర్ణయం తీసుకున్నామన్న ఆయన పులివెందుల లో ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మనేజ్మెంట్ ఏర్పాటు కు కాబినెట్ ఆమోదం తెలిపింది . ఏ పి ఎం ఈ ఆర్ ని అనే సంస్థ ను ఆర్డినెన్స్ ద్వారా ఏర్పాటుకు కాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు . 16 కొత్త మెడికల్ కాలేజీ ల ఏర్పాటుకు అవసరం అయిన కార్పొరేష ఏర్పాటు అయిన 16000 కోట్లు సమకూర్చుకోవడానికి ఆమోదం తెలుపగా సమగ్ర సర్వే ద్వారా ప్రతి భూమికి సబ్ డివిసిన్ ప్రకారం మార్క్ చేయాలనీ నిర్ణయం తీసుకుంది . కొత్త పర్యాటక విధానానికి ఆమోదం తెలిపిన కేబినెట్ , కోవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజికి ఆమోదించింది . రూ 198.05 కోట్ల పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజి ఆర్ధిక సాయం ఇవ్వనున్నారు తద్వారా 3910 పర్యాటక సంస్థలకు ఆర్ధికంగా లబ్ధి కలగనుంది . కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న హోటళ్లు , రెస్టారెంట్లు , టూర్ ఆపరేటర్లు , ట్రావెల్ ఏజెంట్లకు కూడా సాయం చేయనుంది ప్రభుత్వం .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The Cabinet approved several issues of the concluded AP Cabinet meeting"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0