Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The second installment of Jagannath Ammoodi financial assistance on January 9

 జనవరి 9న జగనన్న అమ్మఒడి రెండో విడత ఆర్థిక సాయం.

The second installment of Jagannath Ammoodi financial assistance on January 9

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

ఈ నెల 16న లబ్ధిదారుల జాబితా ప్రదర్శన

షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి

2020-21 ఏడాదికి గానూ వచ్చే నెల (జనవరి) 9వ తేదీన జగనన్న అమ్మ ఒడిపథకం రెండో విడత ఆర్థిక సాయం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందివ్వనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రెండో ఫేజ్ చెల్లింపుల్లో భాగంగా షెడ్యూల్ ను మంత్రి ప్రకటించారు. ఇప్పటికే పాఠశాలల్లో అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్లు నమోదుచేపట్టామన్నారు. ఈనెల 16న అర్హుల జాబితాను వార్డు, గ్రామ సచివాలయల్లో ప్రదర్శనకు పెడతామన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువుకు పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి... జగనన్న అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుతున్న పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలు, ఎయిడెడ్ అన్ ఎయిడెడ్, ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువే విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి పథకం కింద మొదటి విడతగా 43,54,600లపైగా లబ్ధిదారులకు రూ.6.336 కోట్లు అందజేశామన్నారు. 2020-21 ఏడాదికి గానూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, పారదర్శకంగా...అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. ఇప్పటికే అర్హులైన విద్యార్థులు తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్ల నమోదు ప్రక్రియ ఈ నెల 10 తేదీ నుంచి ప్రారంభమైందన్నారు. ఈ నెల 20 వరకూ ఈ నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 

పాదర్శకంగా ‘జగనన్న అమ్మ ఒడి’ అమలు

అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పేర్లను నమోదు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబరు, రేషన్ కార్డు అందజేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కులం, ప్రాంతం, వివక్ష లేకుండా ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు. వచ్చే నెల(జనవరి)9వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిచేతుల మీదుగా జగనన్న అమ్మఒడి రెండో విడత ఆర్థికసాయం అందజేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం షెడ్యూల్ రూపొందించామన్నారు. 

వరుస సంఖ్య తేదీ కార్యక్రమం

  • 1 10.12.2020 నుంచి 20.12.2020 అర్హులై విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్ల నమోదు 
  • 2 16.12.2020 అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల జాబితాలను వార్డు సచివాలయాలు, గ్రామ సచివాయల్లో ప్రదర్శన
  • 3 19.12.2020 ప్రదర్శనకు ఉంచిన జాబితాలో తప్పొప్పుల సవరణ అనంతరం అదే రోజు సాయంత్రం 6 గంటలకు అమ్మ ఒడి పోర్టల్ ప్రదర్శన
  • 4 20.12.2020 నుంచి 24.12.2020 సంబంధిత పాఠశాల, కళాశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లతో పాటు వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది చే సవరించిన జాబితా పరిశీలన
  • 5 26.12.2020 తుది సవరణ అనంతరం జాబితాలను వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శన
  • 6 27.12.2020 నుంచి 28.12.2020 తుది సవరణ జాబితాలను గ్రామ, వార్డు సభల్లో ఆమోదం
  • 7 29.12.2020 గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన జాబితాలను ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లచే ఆన్ లైన్లో పొందుపర్చుట
  • 8 30.12.2020 ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ద్వారా వచ్చిన ఫైనల్ జాబితాలను ఆయా జిల్లా డీఈవోలు.. కలెక్టర్లకు పంపుట

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The second installment of Jagannath Ammoodi financial assistance on January 9"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0