Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

To speak English well '

 ఇంగ్లీషులో బాగా మాట్లాడాలంటే '  

To speak English well '
'ఇంగ్లీషులో బాగా మాట్లాడాలంటే '

  • తోటివారితో సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ లో మాట్లాడాలి . 
  • బస్సుల్లో , రైళ్ళల్లో ప్రయాణించేటప్పుడు సహ ప్రయాణీకులు మాట్లాడుకునే మాటలను మనస్సులోనే వీలైనన్ని వాక్యాలను ఇంగ్లీషులోకి తర్జుమా చేయడానికి ప్రయత్నించాలి . 
  • తెలుగు సినిమాను సినిమా హాలులో లేదా టివిలో చూస్తున్నప్పుడు అక్కడ వచ్చే డైలాగులను ఇంగ్లీషులోకి మనస్సులోనే మార్చాలి . 
  • సభలు , సమావేశాలు , మీటింగులు మరియు గుంపులుగా చేరి జనాలు మాట్లాడే సందర్భాలలో ఊరికే కూర్చోక తెలుగులో మాట్లాడే మాటలను సాధ్యమైనన్ని ఇంగ్లీష్ లోకి మార్చండి .
  •  ఇంగ్లీష్ లో మాట్లాడే సందర్భాలలో వచ్చే సందేహాలను ఒక పేపర్ మీద వ్రాసుకొని ఎవరైనా ఇంగ్లీష్ టీచరును లేదా ఇంగ్లీష్ బాగా వచ్చిన స్నేహితుని అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలి
  •  చందమామ కథల పుస్తకాలను ( ఇంగ్లీషు & తెలుగు ) కొని , మొదటగా తెలుగు చందమామ పుస్తకంలోని ఒక కథ చదివి , ఆ తరువాత ఇంగ్లీష్ చందమామలో అదే కథను చదవాలి .
  •  ఇలా రోజు ఒక కథను చదవడం ద్వారా ఇంగ్లీష్ గ్రామర్ వస్తుంది . 
  • స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేప్పుడు ప్రారంభంలోనే గ్రామర్ పుస్తకాలు చదవవద్దు . 
  • ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు గ్రామర్ రూల్స్ గుర్తు తెచ్చుకోవద్దు . 
  • రకరకాల ఆంగ్ల వాక్యాలను తెలుగు అర్థాలతో సహా మాట్లాడడం అభ్యసించండి . 
  • మీరు మాట్లాడే సమయంలో గ్రామర్ రూల్స్ గుర్తు తెచ్చుకొని మాట్లాడుతున్నంత వరకు మీకు ఇంగ్లీషులో మాట్లాడడం రాదని గుర్తుంచుకోండి .
  •  ఇంగ్లీష్ వాక్యాలను వినడం మీద దృష్టిని కేంద్రీకరించండి . 
  • ఇంట్లో ఉన్న 3 వ తరగతిగానీ ఆపై తరగతి చదివే మీ పిల్లలతో మరియు ప్రక్క ఇంటివారి పిల్లలతో ఇంగ్లీష్ లో మాట్లాడడం ప్రారంభించండి .
  • ప్రతి రోజు any English paper చదవండి .
  •  ప్రతి రోజు దానిలోని మీకు తెలియని 10 ఇంగ్లీష్ పదాలను వ్రాసుకొని డిక్షనరీ ద్వారా వాటి అర్థాలు తెలుసుకోండి . 
  • ఓకాబులరీ పెరుగుతుంది . 
  • ఇంగ్లీష్ లో వ్రాసేటప్పుడు ఆలోచించడానికి తగిన సమయం ఉంటుంది . 
  • కానీ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆలోచించే వ్యవధి ఉండదు . 
  • వెంటవెంటనే మాట్లాడాలి . 
  • వివిధ రకాల ఇంగ్లీష్ వాక్యాలను బాగా మాట్లాడడం , అభ్యసించడం చేతనే మనం వెంటనే మాట్లాడగలము . 
  • నోరు తెరచి తప్పో , ఒప్పో ఏదో ఒకటి ఇంగ్లీష్ లో మాట్లాడుతుండాలి . 
  • నోరు తెరచి మాట్లాడకుండా ఉన్నంత వరకు మీకు ఎంత గ్రామర్ వచ్చినా , ఇంగ్లీష్ డిక్షనరీ అంతా కంఠస్థమైనా ఒక్క వాక్యం కూడా ఇంగ్లీష్ లో మాట్లాడలేరు .
  • కానీ మీ ఎదుట ఉన్న వారు మాట్లాడే ప్రతి మాటా మీకు చక్కగా అర్థమౌతుంది .
  • కేవలం మాట్లాడే అభ్యాసం చేయకపోవడం వల్లనే మీరు తిరిగి ఇంగ్లీష్ లో మాట్లాడలేరు . 
  • కాబట్టి మీరు తప్పని సరిగా నోరు విప్పాల్సిందే . 
  • కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది . 
  • ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోండి . 
  • మనకు తెలిసినంతలో ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అందరూ మెచ్చుకుంటారు . 
  • మన గురించి గొప్పగా ఊహించుకొంటారు . తప్పులు దొర్లినా ఎవరూ పట్టించుకోరు . 
  • మనం చెప్పే విషయం మీదే ఎదుటివారి దృష్టి ఉంటుంది . 
  • తప్పుగా మాట్లాడినా ఎగతాళి చేయడం , నవ్వడం , కామెంట్ చేయడం ఎవరూ చేయరు . 
  • పైగా మనమీద అభిమానం ఉన్నవారు మనం మాట్లాడిన తరువాత మనం చేసిన తప్పులను ఎవరూలేని సమయంలో తెలియజేసి మనల్ని ప్రోత్సహిస్తారు . 
  • హెలీ ఫెయిత్ వారివి 3 వ తరగతి నుండి 7 వ తరగతి వరకు గల ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాలను చదివితే చక్కగా ఇంగ్లీష్ గ్రామర్ వస్తుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "To speak English well '"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0