Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Web ... lub dub

 వెబ్... లబ్ డబ్



  • తొలి రోజే సాంకేతిక సమస్యలు 
  • సక్రమంగా పనిచేయని సర్వర్‌
  • అన్ని క్యాడర్లకు లింకు రాకపోవడంతో ఆందోళన
  • ఉపాధ్యాయ బదిలీ వెబ్‌ ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ ప్రారంభం.

ఉపాధ్యాయ బదిలీల వెబ్‌ కౌన్సెలింగ్‌ విధాన ప్రక్రియలో ఐచ్ఛికాల నమోదుకు ప్రభుత్వం శుక్రవారం వెబ్‌లింకును అందుబాటులోకి తీసుకొచ్చింది. బదిలీకి దరఖాస్తు చేసుకున్న వారిలో సీనియారిటీ ప్రామాణికంగా తీసుకుని ఈనెల 15లోపు ఐచ్ఛికాలు ఇచ్చుకోవాలని సూచించింది. వాటి ఎంపికలో ఉపాధ్యాయులకు పరిమితులు లేవు. ఎన్ని ఖాళీలు అయినా ఇచ్చుకోవచ్చని స్పష్టం చేసింది. ఆప్షన్ల నమోదులో మొదటి రోజే గురువులకు అసౌకర్యం ఏర్పడింది. కొద్దిసేపు సర్వర్‌ పనిచేయలేదు. అనంతరం పునరుద్ధరించినా అన్ని కేటగిరీలకు సంబంధించిన ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇవ్వలేదు. కేవలం గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలకు సంబంధించిన లింకు మాత్రమే ఇవ్వటంతో మిగిలిన వారు ఆందోళన చెందారు. గ్రేడ్‌-2 ఉపాధ్యాయులకు ఇచ్చిన లింకు సవ్యంగా పనిచేయలేదు. వారు ఆప్షన్లు ఇచ్చుకోవటానికి ప్రయత్నిరచగా అందులో క్లియర్‌ వేకెన్సీలు, హేతుబద్ధీకరణ వేకెన్సీలకు బదులు పదోన్నతుల పొందిన వారి ఖాళీలు మాత్రమే డిస్‌ప్లే కావటంతో అయోమయానికి గురయ్యారు. వెబ్‌సైట్‌లో ఏ ఆప్షన్‌ నొక్కినా ప్రమోటీ ఖాళీలు మాత్రమే డిస్‌ప్లే అయ్యాయని గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఉదయం తెరుచుకోవాల్సిన సైట్‌ సాయంత్రానికి తెరుచుకుంది. అది కూడా తప్పులు తడకగా ఉండటంతో తాము 15లోపు ఐచ్ఛికాలు ఎలా నమోదు చేసుకోగలమని ఉపాధ్యాయవర్గం లబోదిబోమంటోంది. మొత్తానికి ఉపాధ్యాయులకు ఏర్పడిన అసౌకర్యాన్ని జిల్లా విద్యాశాఖ యంత్రాంగం, సంఘాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో రాత్రికి సమస్యలను పరిష్కరించి సైట్‌లో అన్ని రకాల ఖాళీలు చూపేలా పునరుద్ధరించటంతో ఊపిరి పీల్చుకున్నారు. స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు, వ్యాయామోపాధ్యాయులు ఐచ్చికాలు ఇచ్చుకోవటానికి వీలుగా వాటికి సంబంధించిన లింకులను శనివారం కల్లా పూర్తిస్థాయిలోకి తీసుకొచ్చే చర్యలు ముమ్మరమయ్యాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

అన్ని పాయింట్లు మీకెలా?

వెబ్‌ కౌన్సెలింగ్‌లో ప్రతి ఒక్కరికీ వారి సర్వీసుకు ఎన్ని పాయింట్లు వచ్చాయో ఆన్‌లైన్‌లో ఉంటుంది. అమృతలూరు మండలం తురిమెళ్ల పాఠశాలకు చెందిన ఓ టీచర్‌కు వికలాంగుల కోటాలో కొన్ని సర్వీస్‌పాయింట్లు కలిశాయి. దీన్ని గమనించిన కొందరు.. వికలత్వం లేకపోయినా అన్ని పాయింట్లు ఎలా సాధ్యమయ్యాయని నేరుగా టీచర్‌ను ప్రశ్నించటమే కాదు.. జిల్లా విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సదరు టీచర్‌ కూడా తనకు పీహెచ్‌ కోటాలో పాయింట్లు కలిశాయని, ఆ కేటగిరీ కిందకు నేను రానని కేటగిరీని మార్చాలని కోరారు.ఈ మేరకు శుక్రవారం ఉదయం జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. తప్పిదాలు ఏమైనా ఉంటే వెంటనే ఉపాధ్యాయులు గుర్తించి డీఈవో దృష్టికి తీసుకురావటం వల్ల ఆ తప్పుల సవరణకు మార్గం సుగమం అవుతోంది.

కొన్ని ఖాళీలను బ్లాక్‌ చేయటంపై 

కొన్ని ఖాళీలను బ్లాక్‌ చేయటంపై ఉపాధ్యాయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం అన్ని క్యాడర్లలో ప్రదర్శించిన ఖాళీలకు సంబంధించి ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. గతంలో బ్లాక్‌డ్‌ ఖాళీలతో ఏదైతే జాబితా ప్రదర్శించారో దానినే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడంతో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం తమ వినతిని పట్టించుకోలేదని విమర్శిస్తున్నాయి. జిల్లాలో ఎస్‌జీటీ ఖాళీలు 2509 ఉండగా వాటిల్లో 791 కనిపించకుండా చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Web ... lub dub"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0