Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Transfers 2020

 ఉపాధ్యాయ బదిలీలను వీడని అవాంతరాలు.

AP Transfers 2020

గ్రేడ్‌-2 హెచ్‌ఎంలు, పండిట్ల న్యాయపోరాటం.

నేటి తీర్పులకు సంఘాల ఎదురుచూపు.

ఉపాధ్యాయుల బదిలీలు ప్రారంభించినప్పటి నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. సంఘాలు బదిలీల విధానాన్ని వ్యతిరేకించినా పాఠశాల విద్యా శాఖ కమిషనరు చినవీరభద్రుడు పట్టుదలతో కేవలం మూడింటిని మినహా మిగిలిన అన్ని కేడర్ల బదిలీలు పూర్తిచేశారు. పండిట్లు (తెలుగు, హిందీ), గ్రేడు-2 హెచ్‌ఎంల బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. ఈనెల 22 నుంచి ఆన్‌లైన్‌లో వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు ప్రారంభం కావాల్సి ఉండగా, ఇంతవరకూ మొదలవలేదు. జిల్లాలో సుమారు వెయ్యి మంది వరకు ఉపాధ్యాయుల బదిలీ ఐచ్ఛికాల నమోదు కోసం ఎదురుచూస్తున్నారు.

బ్లాకింగ్‌ ఉద్దేశం నెరవేరిందా?

మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లిపోవటం వల్ల పాఠశాలలు మూతపడుతున్నాయనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో 30 నుంచి 40 శాతం పోస్టులు బ్లాక్‌ చేశారు. దీనిపై ఇప్పటికీ సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కనీసం ఇద్దరు ఉపాధ్యాయులుండేలా చర్యలు తీసుకొని ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చూడాలని అధికారులు తెలిపినా.. బ్లాకింగ్‌ వల్ల కేవలం ఒక పోస్టు మాత్రమే ఇవ్వడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేకుండా బదిలీలో ఖాళీ అయిన పాఠశాలలు 30 వరకు ఉన్నట్లు సమాచారం. ఏకోపాధ్యాయ, మూతపడిన పాఠశాలలకూ ఇదే తంతు కొనసాగడంపై ఉపాధ్యాయ సంఘాలు బ్లాకింగ్‌ విధానాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ విధానం లేకపోతే ఉపాధ్యాయులు తమకు అనుకూలమైన చోటుకు వెళ్లేవారని చెబుతున్నారు.

గందరగోళం వీటిపైనే..

మొదట్లో ప్రభుత్వం 2019లో అక్టోబరులో జరిగిన పండిట్ల పదోన్నతుల ఖాళీలు చూపించలేదు. సీనియర్‌ పండిట్‌ ఉపాధ్యాయులు మంచి ప్రదేశాలు కోల్పోతున్నామని హైకోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబరులో పదోన్నతి ఉపాధ్యాయులు కూడా అవే పాఠశాలల్లో కొనసాగేలా ఉత్తర్వులివ్వాలని హైకోర్టును ఆశ్రయించడంతో బదిలీలపై ప్రతిష్టంభన నెలకొంది. అయిదేళ్లు, ఐదు విద్యాసంవత్సరాలు పూర్తి చేసిన ప్రధానోపాధ్యాయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో గ్రేడ్‌-2 హెచ్‌ఎంల బదిలీలు ఆగిపోయాయి. హైకోర్టు తీర్పుతో వీటిపై ప్రతిష్టంభన తొలగే అవకాశముందని సంఘ నాయకులు పేర్కొంటున్నారు.

నేటి తీర్పులపైనే అందరి చూపు

హైకోర్టులో పండిట్లకు సంబంధించిన కేసులో సోమవారం తుది తీర్పు వచ్చే అవకాశముందని సంఘ నాయకులు తెలుపుతున్నారు. అది జరిగితేనే తుది సీనియార్టీ, ఖాళీల జాబితాలతో పాటు వెబ్‌ ఐచ్ఛికాల ప్రక్రియ మొదలయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావటంతో బదిలీలు పూర్తిచేయాలా? వద్దా అని అధికారులు మీమాంసలో ఉన్నారు. అందుకే సోమవారం సుప్రీంకోర్టులో పంచాయతీ నోటిఫికేషన్‌పై స్టే వస్తే మిగిలిన ఉపాధ్యాయ బదిలీలు కొనసాగుతాయని, లేకపోతే తాత్కాలికంగా ఆ ప్రక్రియ ఆగినట్లేనని విద్యానిపుణులు భావిస్తున్నారు. సోమవారం వచ్చే కోర్టు తీర్పులపైనే బదిలీలు ఆధారపడే అవకాశముంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Transfers 2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0