Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

‘Co-win‌’ application for vaccine distribution‌

 టీకా పంపిణీ కోసం ‘కో-విన్‌' అప్లికేషన్‌

‘Co-win‌’ application for vaccine distribution‌


  • కో-విన్‌’ యాప్‌ వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌
  • త్వరలోనే Google స్టోర్‌, ఆపిల్‌ స్టోర్లలో అందుబాటులోకి
  • వివరాల నమోదుకు ఫొటో ఐడీ తప్పనిసరి


Google ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ‘కొ-విన్‌' యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ ప్రజలకు ఈ  నమోదు ప్రక్రియ ప్రస్తుతానికి అందుబాటులోకి లేదు. ఆరోగ్య అధికారులు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు మాత్రమే నమోదుకు అనుమతి.  వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ముందుగా వ్యాక్సిన్‌ వేస్తారు. టీకా కోసం ఇప్పటికే లక్ష మందికి పైగా  ఆరోగ్య సిబ్బంది నమోదు చేసుకున్నట్టు సమాచారం.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైన తరువాత ప్రజలు నమోదు చేసుకునేందుకు  ఏదేని ప్రభుత్వ గుర్తింపు కార్డు , ఇతర వివరాలను అప్‌లోడ్ చేయాలి.  ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ తదితరకార్డులను అప్‌లోడ్ చేసి నమోదు చేసుకోవచ్చు.

కో-విన్‌ : ఐదు విభాగాలు

దేశంలో సాధారణ టీకా కార్యక్రమాల కోసం కేంద్రం ‘ఈవిన్‌' (ఎలక్ట్రానిక్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌) అని పిలుస్తారు.  అయితే తాజాగా కొవిడ్‌-19 టీకాను కోట్లాది మంది భారతీయులకు  అందుబాటులోకి తెచ్చేలా అత్యాధునిక ఫీచర్లతో, ఆధునిక సామర్థ్యంతో కో-విన్‌ (కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌) యాప్‌ను కేంద్రం తీసుకొస్తోంది.

రిజిస్ట్రేషన్‌, అడ్మినిస్ట్రేటర్‌, వ్యాక్సినేషన్‌, బెనిఫిషియరీ ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌, రిపోర్టు అనే ఐదు విభాగాలుంటాయి.

రిజిస్ట్రేషన్‌: ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌ వర్కర్స్‌ కానటువంటి సాధారణ ప్రజలు వ్యాక్సినేషన్‌ కోసం ‘కొ-విన్‌'లోని ‘రిజిస్ట్రేషన్‌ విభాగం’లో రిజిస్టర్‌ కావొచ్చు. దీనికి ఫొటో ఐడెంటిటీ అవసరం.

అడ్మినిస్ట్రేటర్‌: వ్యాక్సిన్‌ అవసరమైన ప్రజలు యాప్‌లో నమోదు చేసిన సమాచారాన్ని ఈ విభాగంలో అధికారులు పర్యవేక్షిస్తారు.

వ్యాక్సినేషన్‌: వ్యాక్సిన్‌ పంపిణీ ఏ స్థాయిలో ఉన్నది? ఎంత మంది వ్యాక్సిన్‌ వేసుకున్నారు? అర్హుల జాబితా తదితర అంశాలు ఉంటాయి.

బెనిఫిషియరీ ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌: టీకా వేసుకున్న లబ్ధిదారుల మొబైల్‌లకు ‘వ్యాక్సిన్‌ తీసుకున్నట్టు’ ఎస్సెమ్మెస్‌ పంపిస్తారు. క్యూఆర్‌ ఆధారిత ధ్రువపత్రాన్ని కూడా జారీ చేస్తారు.

రిపోర్టులు: ఎన్ని వ్యాక్సిన్‌ సెషన్లు పూర్తయ్యాయి? ఒక్కో వ్యాక్సిన్‌ సెషన్‌కి ఎంత మంది హాజరయ్యారు? ఎంత మంది గైర్హాజరయ్యారు వంటి రిపోర్టులు ఇందులో ఉంటాయి.

కో-విన్‌'లో రిజి స్ట్రేషల్‌ ఎలా?

యాప్‌లో రిజిస్ట్రేషన్‌, వివరాల నమోదులో భాగంగా ఫొటో ఐడెంటిటీని  (ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, పెన్షన్‌ ధ్రువ పత్రం) అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.  నమోదు ప్రక్రియ పూర్తయ్యాక.. వ్యాక్సిన్‌ వేసే తేదీ, సమయం, ప్రాంతం వివరాలు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఎస్సెమ్మెస్‌ రూపంలో వస్తాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "‘Co-win‌’ application for vaccine distribution‌"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0