Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

EPFO Benefits: Have an EPF account? These 4 benefits are not to be missed

 EPFO Benefits: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఈ 4 ప్రయోజనాలు మిస్ కావొద్దు

EPFO Benefits: Have an EPF account? These 4 benefits are not to be missed

EPFO Benefits ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఆ అకౌంట్‌పై వచ్చే ప్రయోజనాల గురించి పూర్తిగా అవగాహన ఉండదు. ఈపీఎఫ్ అకౌంట్‌తో వచ్చే ప్రయోజనాల గురించే తెలుసుకుందాం.


  • 1. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ స్కీమ్ నిర్వహించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉంటుంది. ప్రతీ నెల జీతంలోంచి ఉద్యోగి వాటాతో పాటు యజమాని వాటా ఈపీఎప్ అకౌంట్‌లో జమ అవుతుంది. ఇందులో కొంత పెన్షన్ స్కీమ్‌లోకి వెళ్తుంది. 
  • 2. ఈపీఎఫ్ అకౌంట్ ఉంటే వచ్చే లాభాలపై అకౌంట్ హోల్డర్లకు పెద్దగా తెలియదు. పెళ్లిళ్లు, హెల్త్ ఎమర్జెన్సీ, ఇతర అవసరాలకు పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు తప్ప ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మరి ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ప్రధానంగా వచ్చే 4 బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి. 
  • 3. Free Insurance: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి ఉచితంగా ఇన్స్యూరెన్స్ ఉంటుంది. దీన్నే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్ అంటారు. ఈ స్కీమ్ ద్వారా రూ.6 లక్షల వరకు బీమా ఉంటుంది. సర్వీసులో ఉండగా ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ మరణిస్తే నామినీకి ఇన్స్యూరెన్స్ డబ్బులు వస్తాయి. ఉద్యోగి జీతాన్ని బట్టి గరిష్టంగా రూ.6 లక్షల వరకు బీమా పొందొచ్చు.
  • 4. Tax Benefits: ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆదాయపు పన్ను చట్టంలోని 80 సీ కింద 12 శాతం వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు. పాత పన్ను విధానం ఎంచుకున్నవారికి ఇది వర్తిస్తుంది. 
  • 5. Pension Benefit: రిటైర్మెంట్ తర్వాత ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు పెన్షన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈపీఎఫ్ఓ చట్టం ప్రకారం ఉద్యోగుల మూల వేతనంలో 12 శాతం+డీఏ పీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతుంది. కంపెనీలు కూడా 12 శాతం జమ చేస్తాయి. అందులో 3.67 శాతం ఉద్యోగి అకౌంట్‌లోకి, 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లోకి వెళ్తాయి. ఈ పెన్షన్ స్కీమ్ ద్వారా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందొచ్చు. 
  • 6. Interest: ఈపీఎఫ్ అకౌంట్‌లో ఉన్న డబ్బులకు ఈపీఎఫ్ఓ ప్రతీ ఏడాది వడ్డీ చెల్లిస్తుంది. ఈ వడ్డీ ప్రతీ ఏటా మారుతూ ఉంటుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.50 శాతం వడ్డీని ఇస్తోంది ఈపీఎఫ్ఓ. యాక్టీవ్‌గా ఉన్న అకౌంట్లు మాత్రమే కాదు, నిలిపివేసిన అకౌంట్లలో కూడా వడ్డీ జమ అవుతూ ఉంటుంది. గతంలో అయితే మూడేళ్లు అకౌంట్లు యాక్టీవ్‌లో లేకపోతే వడ్డీ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు వడ్డీ లభిస్తుంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "EPFO Benefits: Have an EPF account? These 4 benefits are not to be missed"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0