Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Free Corona Vaccine for Frontline Workers, Says PM Modi

 ఫ్రంట్‌లైన్ యోధుల టీకా ఖర్చు కేంద్రానిదే - ప్రధానమంత్రి

Free Corona Vaccine for Frontline Workers, Says PM Modi

కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే టీకా పంపిణీ కార్యక్రమం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి దశలో భాగంగా మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. అయితే ఈ ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్రాలపై ఎలాంటి భారం పడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. 

వ్యాక్సిన్‌ పంపిణీ సన్నాహాలపై నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌ సమావేశంలో మోదీ భేటీ అయ్యారు. టీకా పంపిణీ ఏర్పాట్లపై సీఎంలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు కోట్ల టీకాల పంపిణీ తర్వాత మరోసారి సీఎంలతో భేటీ అవుతానని తెలిపారు. తదుపరి కార్యాచరణపై ఆ సమావేశంలో చర్చిద్దామని చెప్పారు. ఇక తొలి దశలో ప్రయివేటు లేదా ప్రభుత్వ రంగాలకు చెందిన 3 కోట్ల మంది కరోనా యోధులకు టీకా ఇస్తామన్నారు. అయితే వీరిలో ప్రజా ప్రతినిధులు ఉండబోరని మోదీ స్పష్టం చేశారు. రెండో దశలో 50ఏళ్ల పైబడిన వారికి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 50ఏళ్ల లోపువారికి ప్రాధాన్యమిస్తామన్నారు. 

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం 2.5కోట్ల మంది మాత్రమే టీకా తీసుకున్నారని మోదీ అన్నారు. జులై నాటికి దేశంలో 30కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ పూర్తయినట్లు వెల్లడించారు. టీకాలపై వదంతులు వ్యాపించకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలన్నారు. 

శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే వ్యాక్సిన్లపై నిర్ణయం తీసుకున్నట్లు మోదీ తెలిపారు. ఇప్పటికే రెండు స్వదేశీ టీకాలకు అనుమతినివ్వగా.. మరో నాలుగు వ్యాక్సిన్లను కూడా త్వరలో అందుబాటులోకి తెస్తామన్నారు. వ్యాక్సినేషన్‌పై రియల్‌ టైం డేటా అవసరమని చెప్పిన మోదీ.. టీకా తీసుకున్న ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ సర్టిఫికేట్‌ను జనరేట్‌ చేయాలన్నారు. దీని వల్ల రెండో డోసు ఇవ్వడం సులభమవుతుందని చెప్పారు.

వ్యాక్సిన్‌ పంపిణీ సన్నాహాలపై సోమవారం (జనవరి 11) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వర్చువల్ ద్వారా జరిగిన ఈ భేటీలో వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై సీఎంలతో చర్చించారు. తొలి దశ టీకాల పంపిణీ తర్వాత ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ అవుతానని ప్రధాని చెప్పారు. తదుపరి కార్యాచరణపై ఆ సమావేశంలో చర్చిద్దామని అన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Free Corona Vaccine for Frontline Workers, Says PM Modi"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0