Identify students who have dropped out
చదువు మానేసిన విద్యార్థులను గుర్తించండి
ఇంటింటి సర్వే నిర్వహించి.. మళ్లీ బడి బాట పట్టించండి
స్కూళ్ల పునఃప్రారంభంపై మార్గదర్శకాలు రూపొందించిన కేంద్ర విద్యాశాఖ
న్యూఢిల్లీ, జనవరి 10: లాక్‌డౌన్ కారణంగా చదువుకు దూరమైన విద్యార్థులను గుర్తించి, వారిని తిరిగి బడి బాట పట్టించే దిశగా కేంద్రం చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించాలని అన్ని రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆదేశించింది. బడుల్లో ఉన్న నిబంధనల నుంచి విద్యార్థులకు కొన్ని వెసులుబాట్లు కల్పించాలని, ఇప్పటికే జరిగిపోయిన పాఠాలను కూడా తిరిగి బోధించే ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్రాలకు సూచించిందని కేంద్ర విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
‘క్లాస్‌రూమ్ ఆన్ వీల్స్’ పేరుతో మొబైల్ స్కూళ్లు ఏర్పాటుచేసి.. గ్రామాల్లో తిరుగుతూ పాఠాలు బోధించడం వంటి మార్గాలను పరిశీలించాల్సిందిగా సూచించింది. ఇలా చేయడం వల్ల.. బడి మానేసే వారి సంఖ్య కూడా తగ్గుతుందని విద్యాశాఖ భావిస్తోంది. దేశంలోని చదువు మానేసిన 6-18 ఏళ్ల మధ్య వయసు పిల్లల్ని గుర్తించాలని రాష్ట్రాలను కోరింది
‘‘పిల్లలు బడికి వెళ్తే.. అక్కడ నాణ్యమైన విద్యతో పాటు సమానత్వాన్ని కూడా నేర్చుకుంటారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా పాఠశాల విద్యపై కరోనా ప్రభావం కూడా తగ్గుతుంది. దేశంలో పాఠశాలలు మళ్లీ ఎప్పుడు తెరవాలి అన్న విషయాల్లో విద్యాశాఖ ఇప్పటికే మార్గదర్శకాలను కూడా రూపొందించింది’’ అని కేంద్ర విద్యాశాఖ అధికారి తెలిపారు.
0 Response to "Identify students who have dropped out"
Post a Comment