Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Indian Post Instant Money Order:

Indian Post Instant Money Order: ఇక పోస్టాఫీసుల్లోనూ తక్షణ నగదు బదిలీ సేవలు.. డబ్బుల ఎలా పంపించాలో వివరణ

Indian Post Instant Money Order:


మీరు ఎవరికైనా డబ్బు పంపించాలనుకుంటున్నారా.. అయితే మీరు బ్యాంకు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. భారత పోస్టల్ శాఖ వారు కొత్త సేవను ప్రారంభించింది. అదే ఇన్ స్టాంట్ మనీ ఆర్డర్(Instant Money Order-IMO). అక్కడ మీరు డబ్బును తక్షణమే మరోకరికి పంపించవచ్చు. ఇండియా పోస్ట్ వెబ్ సైట్ ప్రకారం భారత భూభాగంలో ఇద్దరు నివాసితులు మధ్య భారతదేశంలోని పోస్ట్ ఆఫీసులు (ఐఎంఓ కేంద్రాలు) ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. సదరు వ్యక్తులు రూ.1000 నుంచి రూ.50,000 వరకు డబ్బు పంపుకునే అవకాశాన్ని ఇండియా పోస్ట్ ఇచ్చింది. ఇందుకుగాను స్థిర ఛార్జీలను(Fixed Cost) వసూలు చేస్తుంది.

11 నగరాల్లో సేవలు..

IMO ఉపయోగించి పోస్టాఫీసు నుంచి డబ్బు బదిలీ చేయవచ్చు. దేశవ్యాప్తంగా 11 నగరాల్లో ఈ సేవలు ఉన్నాయి. ప్రస్తుతం 24 ఐఎంఓ పోస్టాఫీసులు అందుబాటులో ఉన్నాయి. ఇది వెబ్ ఆధారిత తక్షణ డబ్బు బదిలీ సేవ. ఇక్కడ రిసీవర్ డబ్బును తక్షణమే పొందుతారు. అత్యంత సులవైన రీతిలో దీన్ని ఉపయోగించుకోవచ్చు.

డబ్బు బదిలీ చేయడానికి నియమాలు..

ఇందులో వినియోగదారుడు రూ.19,999 వరకు నగదు రూపంలో జమ చేయాలి. లేదా అదే ఐఎంఓ పోస్టాఫీసులో వ్యక్తి పొదుపు ఖాతాకు జమ చేయవచ్చు. అయితే రూ.20,000 కంటే ఎక్కువ సొమ్ముకు చెక్ అవసరం.

డిజిట్ IMO నెంబర్..

16 అంకెల ఐఎంఓ సంఖ్య కోసం వినియోగదారు పోస్టాఫీసులోని కౌంటర్ వద్ద రిమిట్ చెల్లింపు ఫారం నింపాలి. ఆ సంఖ్య కంప్యూటర్ ద్వారా జనరేట్ అవుతుంది.

తక్షణమే డబ్బు బదిలీ..

తక్షణ డబ్బు బదిలీ చేయాలనుకునే వ్యక్తి ఐఎంఓ నెంబర్ షేర్ చేయాలి. అనగా ఫోన్, ఎస్ఎంఎస్ ఈమేయిల్ లేదా ఇతర మార్గాలను ఉపయోగించి 16 అంకెల ఐఎంఓ నెంబర్ ను పంపించుకోవాలి. డబ్బు స్వీకరించే వ్యక్తి అదే 16 అంకెల సమాచారాన్ని ఏదైనా ఐఎంఓ ఆధారిత పోస్టాఫీసులో పంచుకోవడం ద్వారా డబ్బు పొందవచ్చు.

ఐఎంఓకు ఈ పత్రాలు కావాలి..

లావాదేవీని విజయవంతంగా నిర్వహించడానికి రిసీవర్ ఫొటో గుర్తింపు కార్డుతో పాటు ఫారంను పూరించాలి. గుర్తింపు కార్డు అంటే.. ఓటెడ్ ఐడీ కార్డు, పాన్ కార్డు, రిసీవర్ ఫొటోతో పాటు రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు లాంటివి ఉంటే సరిపోతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Indian Post Instant Money Order:"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0