Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

lIC: Good news for AIC policyholders ... Special mobile app called ANANDADA

 LIC : ఎఐసీ పాలసీహోల్డర్లకు గుడ్ న్యూస్ ... ANANDA పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌

lIC: Good news for AIC policyholders ... Special mobile app called ANANDADA


LIC కూడా అలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని పాలసీహోల్డర్లకు సేవలు అందిస్తోంది. మోదీ ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎల్ఐసీ... తమ ఏజెంట్ల కోసం ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించింది. ఆత్మ నిర్భర్ ఏజెంట్ న్యూ బిజినెస్ డిజిటల్ అప్లికేషన్-ANANDA పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను 2020 నవంబర్ 19న ఆవిష్కరించింది.

ఇప్పుడు ఎల్ఐసీ ఆనంద యాప్‌లో కొత్త ఫీచర్ వచ్చేసింది. ఆన్‌లైన్ ప్రపోజల్ డిపాజిట్ కలెక్షన్ ఫీచర్‌ను అందిస్తోంది ఎల్ఐసీ. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు ప్రపోజల్ డిపాజిట్‌ను ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ గేట్‌వే ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఇ-వ్యాలెట్స్, యూపీఐ ఉపయోగించి సింపుల్‌గా పేమెంట్ చేయొచ్చు. అంతేకాదు... ఎల్ఐసీ కస్టమర్లు యూలిప్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికీ ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలంటే రకరకాల ఫామ్స్‌పై సంతకాలు పెట్టే రోజులు పోయాయి. ఇప్పుడు మొత్తం ఆన్‌లైన్‌లోకి వచ్చేసింది. పేపర్ అవసరం లేకుండా కస్టమర్లకు పాలసీలు అందించేందుకు ఏజెంట్లకు ఎల్ఐసీ ఆనంద మొబైల్ యాప్‌ ఉపయోగపడుతోంది. భారత జీవిత బీమా పరిశ్రమలోనే ఇలాంటి యాప్ ఉపయోగిస్తున్న ఘనత తమదేనని ఎల్ఐసీ ప్రకటిస్తోంది.

ఎల్ఐసీలో గతంలో ఉన్న ఫిజికల్ పేపర్స్ అన్నీ డిజిటల్‌లోకి మారాయి. ఎల్ఐసీ ఆనంద యాప్‌లో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. కస్టమర్లు కొత్తగా ఎల్ఐసీ పాలసీ తీసుకోవాలంటే ఇప్పుడు చాలా సులువు. ఏజెంట్ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. డిజిటల్ పద్ధతుల్లో సులువుగా పాలసీ తీసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "lIC: Good news for AIC policyholders ... Special mobile app called ANANDADA"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0