Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Panchayat Elections: Put them away for panchayat elections .. otherwise the actions are not wrong: SEC Nimmagadda Ramesh

 Panchayat Elections : వారిని పంచాయతీ ఎన్నికలకు దూరంగా పెట్టండి .. లేకపోతే చర్యలు తప్పవు : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ 

Panchayat Elections: Put them away for panchayat elections .. otherwise the actions are not wrong: SEC Nimmagadda Ramesh

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో గ్రామ వాలంటీర్లను వినియోగించరాదని, వారు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ హెచ్చరించారు. వారిని పంచాయతీ ఎన్నికలకు దూరంగా పెట్టాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తహసీల్దార్లు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల జారీలో అలసత్వం వహించినట్లు ఫిర్యాదులు వస్తే ఊరుకునది లేదని అన్నారు. ఉద్యోగుల విజ్ఞప్తులను ఎన్నికల సంఘం పరిశీలించి సహాయ సహకరాలు అందిస్తుందని అన్నారు. విజయవాడ నుంచి బుధవారం జిల్లాల్లోని ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు, సలహాలు చేశారు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌.

ఉద్యోగ సంఘాలు ఎన్నికల సంఘంపై తీవ్ర పదజాలంతో మాట్లాడినా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఉద్యోగుల పక్షాన నిలిచిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలను స్వాగతిస్తున్నా.. ఉద్యోగుల విజ్ఞప్తులను ఎన్నికల సంఘం పరిశీలించి సహాయ సహకరాలు అందిస్తుంది అని అన్నారు.

ఇతర రాష్ట్రాల కంటే ధీటుగా ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటర్లు, ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని పోలింగ్‌ సమయాన్ని పొడిగించామన్నారు. రాజకీయాలకతీతంగా నిర్వహిస్తున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు.

కాగా, ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం యోచిస్తోందని, ఓటింగ్‌ ప్రక్రియ, పోలింగ్‌ కేంద్రాల లోపల, బయట జరిగే ఘటనలపై పరిశీలనకు యాప్‌ తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. పోలింగ్‌ వీడియో క్లిప్పింగ్‌లు, ఫోటోలను అందులో అప్‌లోడ్‌ చేయవచ్చన్నారు. వీటిని పరిశీలించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వెల్లడించారు. అలాగే పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏకగ్రీవాలకు సంబంధించి ఏమైనా అవకతవకలు జరిగినట్లయితే సంబంధిత ఆర్వో, ఏఆర్వోలపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.


ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పని చేయాలని, గతాన్ని చూడొద్దు.. నేను కూడా చూడను.. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించుకునేందుకు కలిసికట్టుగా పని చేద్దామని నిమ్మగడ్డ సూచించారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Panchayat Elections: Put them away for panchayat elections .. otherwise the actions are not wrong: SEC Nimmagadda Ramesh"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0