Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sankranthi Holidays in AP

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhra Pradesh Government ) పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ( Sankranthi holidays ) ప్రకటించింది.

Sankranthi Holidays in AP

ఈసారి వారం రోజుల పాటు సెలువులిస్తూ ఉత్తర్వులిచ్చింది . ఆంధ్రప్రదేశ్ లో ఎంతో సందడిగా జరుపుకునే సంక్రాంతి పండుగ . ఈ పండుగ కోసం పెద్దలు , పిల్లలు అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తుంటారు . కొత్త బట్టలు , పిండి వంటలు , ముగ్గులు , గంగిరెద్దు , కోడిపందేలతో ఎక్కడా లేని సందడి సంక్రాంతి సొంతం . అలాంటి సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తారు . గాలి పటాలు ఎగరస్తూ ఎంజాయ్ చేస్తుంటారు . తెలుగువారి పెద్ద పండుగ సమీపిస్తున్నందున విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది . ఈసారి ఏకంగా వారం రోజుల పాటు సెలవులిస్తన్నట్లు ప్రకటించింది . ఈ నెల 11 నుంచి 17 వ తేదీ వరకు ఏడు రోజుల పాటు సెలవులు ఇచ్చింది .

ఐతే ఈనెల 9 వ తేదీన రెండో శనివారం రోజున పాఠశాలలకు సెలవును రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు . దీనికి బదులుగా ఈనెల 16 న అంటే మూడో శనివారంనాడు సెలవు ఇస్తున్నట్లు తెలిపింది . విద్యార్థులు పండుగను కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది . ప్రభుత్వం రెండో శనివారం సెలవు రద్దు చేసినా మూడో శనివారానికి పొడిగించడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . కొవిడ్ కారణంగా ఈ విద్యాసంవత్సరం దాదాపు 6 నెలలు ఆలస్యంగా ప్రారంభమైంది . తొలుత 9 , 10 వ తరగతులకు క్లాసులను ప్రారంభించిన విద్యాశాఖ ఆ తర్వాత విడతల వారిగా 6,7,8 వ తరగతులు చదివే విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తోంది . ఇప్పటికీ 1 నుంచి 5 వ తరగతుల వారికి ఆన్ లైన్లో విద్యను బోధిస్తోంది . వీరి సంబందించిన వర్క్ షీట్లను అభ్యాస యాప్లో ఉంచారు . ఉపాధ్యాయులు వాటిని డౌన్లోడ్ చేసి , విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వాలని పేర్కొన్నారు .


ఫ్లాష్.....ఫ్లాష్....ఫ్లాష్



పూర్తి వివరాలకు క్రింద చూడగలరు


https://www.apedu.in/2021/01/ap-sankranti-holidays-2021-from-10-17th.html

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sankranthi Holidays in AP"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0