Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI doorstep banking

SBI doorstep banking : SBI డోర్‌ స్టెప్ బ్యాంకింగ్ ... ఏంటిది ? దీంతో మనకేంటి లాభం ?

SBI doorstep banking

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులను తెచ్చింది. ఈ సర్వీసుల కింద డబ్బును ఇంటికే డెలివరీ చేస్తుంది. దీని వల్ల కస్టమర్లు బ్యాంక్ సర్వీసులను మరింత సౌకర్యవంతంగా పొందేందుకు వీలు కానుంది. మనకో డౌట్ రావచ్చు... "నేను ఈ సర్వీస్ కోసం రిజిస్టర్ చేసుకోలేదు కదా... మరి నాకు ఇది వస్తుందో రాదో" అని అనుకోవచ్చు. రిజిస్టర్ చేసుకోకపోయినా... ఈ సేవలు పొందవచ్చని SBI తెలిపింది. "మీ బ్యాంక్ ఇప్పుడు మీ ఇంటి గడప దగ్గరే. ఈ రోజే డోర్ స్టెప్ బ్యాంకింగ్ కోసం రిజిస్టర్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మా వెబ్‌సైట్ https://bank.sbi/dsb లోకి వెళ్లండి లేదా టోల్ ఫ్రీ నంబర్లు 1800 1037 188 or 1800 1213 721ను వాడేసుకోండి" అని ఎస్బీఐ తన ట్వీట్‌లో తెలిపింది.

  • 1) ఈ కొత్త సర్వీసుల్లో డబ్బు తీసుకోవడం, డబ్బు పంపడం, చెక్ తీసుకోవడం, చెక్ రిక్విజిషన్ స్లిప్ పొందడం, 15H ఫారం పొందడం, డ్రాఫ్టులు పంపడం, టెర్మ్ డిపాజిట్ అడ్వైస్ డెలివరీ చేయడం, లైఫ్ సర్టిఫికెట్ పొందడం, KYC డాక్యుమెంట్లను ఇవ్వడం వంటివి ఉన్నాయి.
  • 2) ఈ సేవలు కావాలనుకునేవారు 1800111103 టోల్ ఫ్రీ నంబర్‌కు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 మధ్య... బ్యాంక్ తెరిచిన రోజుల్లో కాల్ చేయవచ్చు.
  • 3) ఈ సేవల రిజిస్ట్రేషన్... హోమ్ బ్రాంచిలో జరుగుతుంది.
  • 4) KYC రూల్స్ పక్కాగా ఉన్నవారికే ఈ సేవలు లభిస్తాయి.
  • 5) ఈ సేవలకు ఛార్జీలు ఉంటాయి. ఫైనాన్షియల్ సేవలకు రూ.₹75/-+ GST చెల్లించాలి. నగదు చెల్లింపులు, విత్ డ్రాలకు ₹75/- + GST, చెక్ లేదా ఇన్‌స్ట్రుమెంట్ పికప్ కోసం ₹75/- + GST, చెక్ బుక్ రిక్విజిషన్ స్లిప్ పికప్ కోసం ₹75/- + GST చెల్లించాలి. అదే నాన్-ఫైనాన్షియల్ సేవలకైతే.... టెర్మ్ డిపాజిట్ సలహాలు, సేవింగ్స్ అకౌంట్ స్టేట్‌మెంట్ సేవలు ఉచితం. అదే కరెంటు అకౌంట్ (డూప్లికేట్) స్టేట్‌మెంట్‌కి ₹100/- + GST చెల్లించాలి.6) ఈ సేవలతో నగదు విత్ డ్రా, డిపాజిట్‌లు రోజుకు ఒక ట్రాన్సాక్షన్‌కు రూ.20,000 వరకే వీలవుతుంది.
  • 7) బ్యాంకుకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉండి, మొబైల్ నంబర్ రిజిస్టర్ అయినవారు ఈ సేవలు పొందగలరు.
  • 8) తమ అకౌంట్ జాయింట్‌గా నిర్వహిస్తున్నదైతే వారికి ఈ సేవలు లభించవు.
  • 9) మైనర్ అకౌంట్, నాన్-పర్సనల్ విధానంలో ఉన్న అకౌంట్లకు ఈ సేవలు లభించవు.
  • 10) విత్ డ్రాలను చెక్ ద్వారా చేసుకోవచ్చు అలాగే పాస్ బుక్, విత్ డ్రాయల్ ఫారం ద్వారా చేసుకోవచ్చు.book.

SBIతోపాటూ... HDFC, ICICI, Axis (యాక్సిస్), ఇండస్ ఇండ్ (IndusInd), కోటక్ మహీంద్రా (Kotak Mahindra) కూడా ఈ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులను అందిస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI doorstep banking"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0