Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Video lessons for students!

విద్యార్థులకు వీడియో పాఠాలు!

Video lessons for students!

రూపకల్పనపై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు

ఏపీ దీక్ష ఈ-కంటెంట్‌ క్రియేషన్‌ పేరిట కార్యక్రమం


ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: పుస్తకాల్లోని పాఠాలను చదవడమంటే విద్యార్థుల ఆసక్తి అంతంతే. వాటిని వీడియోలుగా రూపొందించి వర్చువల్‌ విధానంలో చూపిస్తేసులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకు మించి పాఠ్యాంశాలపై తమ ఆసక్తిని ప్రదర్శించవచ్ఛు అందుకే రాబోయే రోజుల్లో వీడియోల రూపంలో పాఠాల బోధనకు ‘ఏపీ దీక్ష ఈ-కంటెంట్‌ క్రియేషన్‌’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.

ఉద్దేశం ఏమిటంటే.. పాఠ్యాంశాలతో కూడిన వీడియోలను రూపొందించేలా ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇవ్వడం ఈ కార్యక్రమ లక్ష్యంలోని ఒక భాగం. రాష్ట్రంలో తొలుత వీటిని రూపొందించగా మంచి ప్రాచుర్యం లభించింది. జాతీయ స్థాయిలోనూ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ స్థాయిలో ఒక వేదికను ఏర్పాటుచేసి దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ దీక్ష ఈ-కంటెంట్‌ క్రియేషన్‌ పేరిట ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఆ తరగతులు జిల్లాలోనూ ప్రారంభమయ్యాయి. పాఠ్యాంశాలను వీడియోలుగా రూపొందించి వాటికి క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కోడ్‌లు కేటాయిస్తారు. వాటిని స్కాన్‌ చేస్తే పాఠాలకు సంబంధించిన లింక్‌లు తెరుచుకుంటాయి. తద్వారా వీడియోల రూపంలో పాఠాలు నేర్చుకునేందుకు అవకాశం ఉంటుంది. పాఠశాలల్లో దృశ్య శ్రవణ విధానం అందుబాటులోకి వస్తుంది.

దశల వారీగా శిక్షణ తరగతులు..

పాఠ్యాంశాలతో కూడిన వీడియోల రూపకల్పనపై సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను నిర్వహించారు. వీటికి జిల్లా నుంచి పది మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. అనంతరం జిల్లా స్థాయిలో శిక్షణ తరగతులను తాడేపల్లిగూడెంలో నిర్వహించారు. ప్రస్తుతం డివిజన్‌ స్థాయిలో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. శిక్షణ పొందే ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా వీడియోలను రూపొందించి జాతీయ స్థాయి వేదికకు పంపాల్సి ఉంటుంది. ఇందుకోసం జిల్లాలోని ఉపాధ్యాయులకు ‘సర్వర్‌’లో సొంత ఖాళీని కేటాయిస్తారు. ఉపాధ్యాయులు పంపే వీడియోల పరిశీలన అనంతరం ఉత్తమమైన వాటిని ఎంపిక చేస్తారు.

జిల్లా ముందంజ..

 ‘‘ఏపీ దీక్ష ఈ-కంటెంట్‌ క్రియేషన్‌’లో భాగంగా ఇప్పటికే శిక్షణ పొందిన జిల్లాలోని ఉపాధ్యాయులు రూపొందించిన వీడియోలను జాతీయస్థాయి వేదికకు పంపించాం. ఇందులో మనం ముందంజలో ఉన్నాం. వీడియోల తయారీపై మరింత మెరుగైన శిక్షణ అందిస్తున్నాం’ అని ఏఎంవో జాన్‌ ప్రభాకర్‌ తెలిపారు.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Video lessons for students!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0