Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

WhatsApp chatbot for doubts about the vaccine

వ్యాక్సిన్‌పై సందేహాలకు వాట్సాప్‌ చాట్‌బాట్‌

WhatsApp chatbot for doubts about the vaccine

సేవలు వినియోగించుకోవడం ఎలా?

కరోనా వ్యాక్సిన్‌పై  సందేహాలు ఉంటే 9013151515 నెంబరుకు వాట్సాప్‌లో  ‘‘ Say Vaccine’’ అని పంపించాలి. అప్పుడు చాట్‌బాట్‌ సేవలు యాక్టివేట్‌ అవుతాయి. ఆ తర్వాత మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. మీ దగ్గరలో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండే ప్రదేశాలు, ఎన్ని డోసులు వేసుకోవాలి? ఎప్పుడు రిజిస్టర్‌ చేసుకోవాలి?తదితర ప్రశ్నలకు చాట్‌బాట్‌ ద్వారా సమాధానం రాబట్టుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇది కూడా అభివృద్ధి దశలో ఉందని సమాచారం. ఇప్పటికే అల్గారిధమ్‌ పూర్తయిందని, అయితే యూజర్‌ నుంచి ఎన్ని ప్రశ్నల వరకు తీసుకోవచ్చనే విషయంపై సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ముందు నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు చాట్‌బాట్‌లో నిక్షిప్తం చేసిన ప్రశ్నలు, సమాధానాలను బట్టి.. వ్యాక్సిన్లు పూర్తి సురక్షితం అని నియంత్రణ సంస్థలు నిర్ధారించిన తర్వాతనే సాధారణ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈలోగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌పై ఈ వ్యాక్సిన్లను ప్రయోగిస్తారు. వాట్సాప్‌ చాట్‌బాట్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న  కొవిన్ యాప్‌తో అనుసంధానించనున్నారు.

కొద్ది గంటల్లో పుణే నుంచి వ్యాక్సిన్ల తరలింపు ప్రారంభం

దేశ ప్రజలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ శుభవార్త చెప్పారు. కొద్ది గంటల్లో కొవిడ్ వ్యాక్సిన్ల రవాణా ప్రారంభం అవుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 41 కేంద్రాల ద్వారా కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మంత్రి హర్షవర్దన్ గురువారం (జనవరి 7) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విర్చువల్ ద్వారా జరిగిన ఈ భేటీలో టీకాకు సంబంధించిన అంశాలపై చర్చించారు. గురువారం సాయంత్రం నుంచి లేదా శుక్రవారం ఉదయం నుంచి వ్యాక్సిన్ల తరలింపు ప్రక్రియ మొదలవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి కరోనా వ్యాక్సిన్ల తరలింపు ప్రక్రియ మొదలవుతుందని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో కొవిషీల్డ్ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇక కొవాగ్జిన్‌ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ రూపొందించిన సంగతి తెలిసిందే.

పుణే నుంచి ప్రత్యేక విమానాల్లో కరోనా వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా ఆయా నిల్వ కేంద్రాలకు తరలించనున్నట్లు మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇందుకోసం ప్రయాణికుల విమానాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలుత కరోనా యోధులకు, అత్యవసరం ఉన్నవారికే టీకాలు ఇస్తారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "WhatsApp chatbot for doubts about the vaccine"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0