Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Another shock to Minister Kodali Nani Nimmagadda Ramesh Kumar .. Order to register the case

 మంత్రి కొడాలి నానికి నిమ్మగడ్డ మరో షాక్.. కేసు నమోదు చేయాలని ఆదేశం

Another shock to Minister Kodali Nani Nimmagadda Ramesh Kumar .. Order to register the case

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ (AP SEC Nimmagadda Ramesh kuamar), మంత్రి కొడాలి నాని (Minister Kodali Nani) మధ్య వివాదం మరింత ముదిరింది. శుక్రవారం కొడాలి నాని ప్రెస్ మీట్ నిర్వహించినప్పటి నుంచి 24 గంటల్లోనే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్,  రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మధ్య వివాదం మరింత ముదిరింది. శుక్రవారం కొడాలి నాని ప్రెస్ మీట్ నిర్వహించినప్పటి నుంచి 24 గంటల్లోనే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల కమిషనర్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీకి నిమ్మగడ్డ ఆదేశాలిచ్చారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు ఐపీసీ 504, 505(1)(C), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ నిబంధనల్లోని క్లాజ్‌-1, క్లాజ్‌-4 కింద కేసు నమోదు చేయాలని ఎస్ఈసీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ, కమిషనర్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందున చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశం

రేషన్ సరుకుల డోర్ డెలివరీ అంశంపై శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి కొడాలి నాని.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై విమర్శలు చేశారు. చంద్రబాబు చెప్పినట్లు ఎస్ఈసీ నడుస్తున్నారని.. జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోవడం ఖాయమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా చంద్రబాబును, నిమ్మగడ్డను పిచ్చాసుపత్రికి పంపాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీరియస్ అయిన ఎన్నికల కమిషనర్.. మంత్రి ప్రెస్ మీట్ ముగిసిన గంటలోనే ఆయనకు షోకాజ్ నోటీసులు పంపి వివరణ కోరింది.

ఎస్ఈసీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన మంత్రి కొడాలి నాని.. తాను వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ను గానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను గానీ దూషించలేదని పేర్కొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఒకటి రెండు మాటలు అని ఉండొచ్చని క్లారిటీ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎస్ఈసీ తీరుపై ప్రజల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించానే తప్ప.. వ్యక్తగతంగా దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని నాని స్పష్టం చేశారు. కావున తాను చేసిన వ్యాఖ్యలు మరోసారి పరిశీలించి షోకాజ్ నోటీసులు వెనక్కితీసుకోవాలని వివరణ లేఖలో ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Another shock to Minister Kodali Nani Nimmagadda Ramesh Kumar .. Order to register the case"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0