Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

BHEL Recruitment 2021

 BHEL Recruitment 2021: బీహెచ్ఈఎల్‌లో 300 ఉద్యోగాలు ఖాళీల వివరాలు ఇవే

BHEL Recruitment 2021

ఐటీఐ పాస్ అయినవారికి శుభవార్త. ఐటీఐ పాస్ అయినవారు ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BHEL లో అప్రెంటీస్ చేసేందుకు అవకాశం లభిస్తోంది. భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ యూనిట్‌లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 300 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BHEL. భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ యూనిట్‌లో వెల్డర్, టర్నర్, పెయింటర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఎంపికైనవారికి ఏడాది అప్రెంటీస్ అవకాశం మాత్రమే లభిస్తుంది. ఐటీఐ తర్వాత ప్రముఖ సంస్థలో అప్రెంటీస్ చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 22 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను భోపాల్‌లోని బీహెచ్ఈఎల్ యూనిట్‌కు చెందిన అధికారిక వెబ్‌సైట్ https://bplcareers.bhel.com/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. అభ్యర్థులు తప్పనిసరిగా నేషనల్ అప్రెంటీస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్-NAPS పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.

BHEL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు- 300

ఎలక్ట్రీషియన్- 80

ఫిట్టర్- 80

మెషినిస్ట్- 30

కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 30

వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 20

టర్నర్- 20

డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానిక్)- 5

ఎలక్ట్రికల్ మెకానిక్- 5

మెకానిక్ మోటార్ వెహికిల్- 5

మెషినిస్ట్ (గ్రైండర్)- 5

మేసన్- 5

పెయింటర్ (జనరల్)- 5

కార్పెంటర్- 5

ప్లంబర్- 5

BHEL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం-  02.02.2021

దరఖాస్తుకు చివరి తేదీ- 22.02.2021

డాక్యుమెంట్స్ పంపడానికి చివరి తేదీ- 2021 మార్చి 3

విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

వయస్సు- 14 నుంచి 27 ఏళ్లు.

Official Notification

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "BHEL Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0