Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Coffee Drink: Shocking news for those who drink coffee every day. Revealed in the latest research

 Coffee Drink: ప్రతి రోజు కాఫీ తాగే వారికి షాకింగ్‌ న్యూస్‌.. తాజా పరిశోధనలలో వెల్లడి

Coffee Drink: Shocking news for those who drink coffee every day. Revealed in the latest research


Coffee Drink: కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదా.. కదా.? అనే ప్రశ్నకు కొన్ని ఏళ్లుగా పరిశోధకులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నాయి. కాఫీకి బానిసలైన వారి మెదడుపై ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఇటీలవ పరిశోధనలలో శాస్త్రవేత్తలు కాఫీ క్రమం తప్పకుండా తీసుకున్నవారిలో వారి మెదడును ప్రభావితం చేస్తుందని గుర్తించారు. కాఫీలో ఉండే పదార్థం మానవ మెదడు యొక్క కేంద్ర నాడి వ్యస్థ భాగాలపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు కాఫీ తాగడం వల్ల క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అలాగే క ఆఫీ తాగడం వల్ల క్యాన్సర్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని మరోసారి ఇలా పరిశోధన ఫలితాలు వెలువడ్డాయి.

తాజాగా ఓ పరిశోధనలో మాత్రం కాఫీ ఎక్కువ తాగడం వల్ల సంబంధిత వ్యాధులు వస్తాయని పరిశోధకులు తేల్చారు.

రోజు ఆరు కప్పులు లేదా అంతకు మించి తాగితే..

రోజులో ఆరు కప్పులు లేదా అంతకు మించి కాఫీ తాగిన వారికి గుండె సంబంధిత వ్యాధులు తప్పకుండా వస్తాయని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్త్రేలియాకు చెందిన పరిశోధకులు తెలిపారు. చాలా ఏళ్ల నుంచి ప్రతి రోజు ఆరు కప్పులకు మించి కాఫీ తాగుతున్నవారిలో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ సరిగా జరగకపోవడంతో గుండె ప్రమాదంలో ఉండే అవకాశం ఉందన్నారు. అలాగే రోజు కాఫీ తాగి ఒక్కసారిగా నిలిపివేసినట్లయితే మెదడుపై ప్రభావం ఉంటుందన్నారు. కాఫీలో కఫెస్టోల్‌ అనే రసాయన మూలం ఉంటుందని, అది రక్తంలో కొవ్వు స్థాయిని పెంచుతుందని పేర్కొన్నారు. ఫిల్టర్‌ చేయని కాఫీలో ఈ కఫెస్టోల్‌ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆరోగ్యంపై కాఫీ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు రోజుకు 300 కోట్ల కప్పుల కాఫీని తాగుతున్నారట. ఏడాదికి 1.79 కోట్ల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

మార్నింగ్ కాఫీ వద్దు..

అలాగే ఉదయం లేవగానే కాఫీ తాగడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం తెల్లారి ఉదయం లేవగానే మన ఒంట్లో కార్టిసాల్‌ లెవెల్స్‌ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో కాఫీ తాగితే అది కార్టిసాల్‌ ప్రొడక్షన్‌పై ప్రభావం ఉంటుందని గుర్తించారు. కార్టిసాల్ తోనే మనం హుషారుగా ఉండి, ఎనర్జిటిక్ గా ఉండగలం. ఒకవేళ మీరు ఉదయమే కాఫీతో ఆ రోజు మొదలు పెట్టారంటే కార్టిసాల్ తక్కువ ఉత్పత్తి అయి..మీరు రోజంతా ఎక్కువ కాఫీ తాగాలనే ఫీలింగ్ లో ఉంటారు. లేదంటే హుషారు తగ్గి, బద్ధకంగా, నిద్ర తూగుతున్నట్టు ఉంటారు. అందుకే మీ ఫస్ట్ కాఫీని ఉదయం 10 గంటల సమయంలో తాగితే కార్టిసాల్ ప్రొడక్షన్ పై దుష్ప్రభావం అస్సలు లేకపోగా మీ డే అంతా మీరు ఎనర్జిటిక్ గా ఉండేలా చేస్తుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Coffee Drink: Shocking news for those who drink coffee every day. Revealed in the latest research"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0