Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Details of the new appointment orders in Telugu

నూతనంగా వచ్చిన ఆయా నియామకపు ఉత్తర్వుల వివరాలు తెలుగులో

Details of the new appointment orders in Telugu

300 లోపు పిల్లలు ఉంటే      1 ఆయా,

300 నుండి 600 లోపు ఇద్దరు ఆయాలు

601 నుండి 900 లోపు ముగ్గురు ఆయాలు

900 పైన.....నలుగురు ఆయాలు.

పూర్తి వివరాలు

  • నెలకు ఆరువేలు జీతం..
  • సంవత్సరం లో  10 నెలలు పూర్తి జీతం..
  • మిగిలిన రెండునెలలు సగం జీతం..
  • ఆయాగా..స్త్రీ లనే తీసుకోవాలి.
  • పాఠశాల ప్రాంతంలోనే నివాసి అయి ఉండాలి.
  • (హాబిటేషన్,వార్డు)
  • జూనియర్ కాలేజీలలో ఐతే అబ్బాయిల టాయిలెట్ల దగ్గర పురుషులను నియమించవచ్చు..
  • ఆయా గా SC/ST/BC/MINORITY'S నుంచే తీసుకోవాల్సి ఉంది.
  • ఆయాగా పిల్లల తల్లుల కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి.
  • 21-50 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి.
  • ఇప్పటికే పనిచేస్తున్న ఆయా కనుక పేరెంట్ కమిటీ కి నచ్చితే 60 సంవత్సరాల లోపు ఉంటే కొనసాగించవచ్చు.
  • ప్రభుత్వం ఆయాలను నియమించబోవడం లేదు.
  • పేరెంట్స్ కమిటీనే నియమించుకోవాలి. జీతం కూడా పేరెంట్స్ కమిటీ/కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ నే చెల్లించాలి.
  • కమిటీ తీర్మానంతో,పనితీరు నచ్చకపోయిన ఎడల ఒకనెల ముందే చెప్పి తొలగించవచ్చు.
  • పేరెంట్స్ కమిటీ ఒక టాయిలెట్ మెయింటెనెన్స్ కమిటీని నియమించుకోవాలి.
  • అందులో హెచ్.ఎం/ప్రిన్సిపల్. కన్వీనర్ గానూ,పేరెంట్ కమిటీ ఛైర్మన్ మరియూ ఇద్దరు యాక్టివ్ మెంబర్లు ,
  • వార్డు సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు,పాఠశాలలోని ఒకటీచర్,ఒక మహిళా ఉపాద్యాయిని,ఒక సీనియర్ బాలుడు,బాలిక సభ్యులుగా ఉండాలి.
  • ఈ కమిటీ పదిహేనురోజులకొకసారి సమావేశం జరిపి పనితీరు,నిర్వహణలను బేరీజు వేసుకోవాలి.
  • పిబ్రవరి/మార్చి నెలలకు గాను కమిటీ  టాయిలెట్ బ్రష్,లిక్విడ్ వగైరాలు సమకూర్చుకోవాలి.
  • ఏప్రిలునుంచి ప్రభుత్వం సరఫరా చేయగలదు.

పాఠశాల PARENTS COMMITTEE ...

 TOILET MAINTENANCE FUND(STMF)  

పేరుతో ఒక‌అకౌంట్ తెరవాల్సి ఉంది.

ఈ అకౌంట్ ను

HM,పెరెంట్ కమిటీ CHAIRMEN,మరియూ వార్డు సచివాలయపు ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ జాయింట్ అకౌంట్ గా ఓపన్ చేయవలసి ఉంది.

ఒకవేళ ఇప్పటికే అకౌంట్ ఉంటే దానికి ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ను జతచేయించవలసి ఉంటుంది‌.

ఆ అకౌంట్ లోకి గత సంవత్సరం వసూలుచేసిన అమ్మ ఒడి చందాలు (ఉన్నట్లయితే) ట్రాన్సఫర్ చేయవలసి ఉంది.

అన్నిటికీ PARENTS COMMITTEE  సమావేశం,తీర్మానం తప్పనిసరి..

ఏడురోజుల లోపు

ఆయాలను నిబంధనలను అనుసరించి నియమించి వివరాలు ఎం.ఆర్.సి కి అందజేయాల్సి ఉంది.

నిబంధనలు అతిక్రమించిన ఎడల చర్యలుకూడా తీసుకొనబడునని తెలుపడమైనది..

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Details of the new appointment orders in Telugu"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0