Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

EPFO: Are you a PF customer? New regulations from April 1 .. Details

EPFO: Are you a PF client? New rules from April 1 .. You need to know these details ..! – New PF tax rules from April 1 2021

 EPFO: మీరు పీఎఫ్‌ ఖాతాదారులా..? ఏప్రిల్‌ 1 నుంచి కొత్త నిబంధనలు.. వివరాలు 

EPFO: Are you a PF client? New rules from April 1 .. You need to know these details ..! – New PF tax rules from April 1 2021

EPFO: మీరు పీఎఫ్‌ ఖాతాదారులా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఈపీఎఫ్‌ నుంచి పొందిన వడ్డీకి పన్ను మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్‌ నుంచి ఈ నిబంధనలను మార్పు చేయనున్నారు. ఈపీఎఫ్‌లో సంవత్సరానికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువ జమ చేసేవారు వారికి అందించే వడ్డీపై ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించారు. ఏడాదికి పీఎఫ్‌ కాంట్రిబ్యూషన్‌ రూ.2.5 లక్షలకు మించితే తీసుకున్న పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిర్మల సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో స్పష్టం చేశారు. అయితే కేవలం ఉద్యోగులు జమ చేసే మొత్తంపైనే ఈ పన్నును లెక్కించనున్నారు.

2021 ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

పీఎఫ్‌లో ఉద్యోగి వాట ఏడాదికి రూ.2.5 లక్షల వరకు ఉంటే 80 సీ కింద ఎప్పటిలాగే మినహాయింపు లభించనుంది. పీఎఫ్‌ ఉద్యోగి వాటా రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే ఆ వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పీఎఫ్‌లో ఉద్యోగితో పాటు అతను పని చేస్తున్న కంపెనీ కూడా ఉద్యోగి తరపున కొంత జమ చేస్తుంది. అయితే ఈ మొత్తానికి కొంత నిబంధనలు వర్తించవు. కేవలం ఉద్యోగి వాటాపై మాత్రమే ట్యాక్స్‌ ఉంటుంది. ఉద్యోగుల ఆదాయపు పన్ను ట్యాక్స్‌ స్లాబ్‌ ప్రకారం ఈ ట్యాక్స్‌ను లెక్కిస్తారు.

ఉద్యోగి ఎంత శాతం ట్యాక్స్‌ పరిధిలోకి వస్తే అంత శాతం ట్యాక్స్‌ కట్టాల్సి ఉంటుంది. ఒక ఉద్యోగి 30 శాతం ట్యాక్స్‌ స్లాబ్‌ పరిధిలోకి వస్తే అతను 30 శాతాన్ని పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే రూ.2.5 లక్షలకు లోపు పీఎఫ్‌ జమ చేస్తే మీరు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. అలాంటి వారు కొత్త ట్యాక్స్‌పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనిపై ఆర్థిక శాఖ త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనుంది.




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "EPFO: Are you a PF customer? New regulations from April 1 .. Details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0