How to find out which number is linked to Aadhaar.
ఆధార్ కి ఏ నంబర్ లింక్ చేశారో తెలుసుకొనే విధానం.
ఆధార్ నెంబర్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది తప్పనిసరి అయిపోయింది. అంతేకాదు అథెంటికేషన్ కూడా సులువు అవుతోంది. అంటే ఎక్కడైనా మీ ఆధార్ నెంబర్‌ను ఉపయోగించినప్పుడు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుందన్నమాట. దీని ద్వారా ఆధార్ నెంబర్‌ను ఇతరులు దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవచ్చు. అయితే ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసిన సమయంలో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చాం అన్న సంగతి చాలామందికి గుర్తుండదు. ఒకరి దగ్గరే రెండు మూడు ఫోన్ నెంబర్లు ఉండటం లేదా ఫోన్ నెంబర్లు మార్చి కొత్తవి తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.
దీంతో ఓటీపీ విషయంలో తిప్పలు తప్పవు. అసలు ఏ నెంబర్‌కు ఓటీపీ వెళ్తుందో కూడా కొన్ని సందర్భాల్లో తెలియని పరిస్థితి.
విధానం
- మరి ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ అయిందన్న విషయం తెలుసుకోవడం ఎలా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే అలాంటి వారికి చాలా సులువుగా తెలుసుకునే ఫెసిలిటీ వచ్చేసింది. ఇందుకోసం మీరు చెయ్యాల్సింది ఏంటంటే మెుట్టమెుదట వెబ్ సైట్ కి వెళ్లాలి. తొలుత యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI అధికారిక వెబ్సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి.
- వెబ్ సైట్ ఓపెన్ అయిన తర్వాత My Aadhaar సెక్షన్లో Aadhaar Services లో Verify Email / Mobile Number ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు కొత్త విండో ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత Send OTPపై క్లిక్ చేయాలి. మీరు సరైన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే The Mobile Number xxxxxxxxxx matches with our records అని వస్తుంది.
- మీరు ఆధార్ నెంబర్‌కు లింక్ లేని మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే The Mobile number you had entered does not match with our recordsఅని వస్తుంది.
- ఇలా వచ్చినప్పుడు మీరు మరో నెంబర్‌తో ప్రయత్నించాలి. అలాగే ఇమెయిల్ ఐడీని కూడా చెక్ చేసుకోవచ్చు. అసలు మొబైల్ నెంబర్ ఏదో ఏమాత్రం ఐడియా లేకపోతే ఎలా తెలుసుకోవాలన్న సందేహం ఉంటుంది. ఇది కూడా సాధ్యమే. యూఐడీఏఐ వెబ్సైట్లో మీరు మీ ఆధార్ నెంబర్‌కు ఏ మొబైల్ నెంబర్ లింక్ చేశారో సులువుగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ UIDAI అధికారిక వెబ్సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయండి. My Aadhaar సెక్షన్లో Aadhaar Services లో Verify an Aadhaar Number పైన క్లిక్ చేయండి.
- ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. Proceed to Verify పైన క్లిక్ చేయండి. Aadhaar Number xxxxxxxxxxxx Exists అని వస్తుంది. దాంతో పాటు మొబైల్ నెంబర్ దగ్గర ఫోన్ నెంబర్ చివరి 3 అంకెలు కనిపిస్తాయి. దీని ద్వారా మీరు ఏ మొబైల్ నెంబర్ లింక్ చేశారో క్లూ దొరుకుతుంది.
- మొబైల్ నెంబర్ దగ్గర ఖాళీగా ఉంటే ఆ ఆధార్ నెంబర్‌కు ఏ ఫోన్ నెంబర్ లింక్ కాలేదని అర్థం. అప్పుడు మీరు మెుబైల్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
0 Response to "How to find out which number is linked to Aadhaar."
Post a Comment